Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

భారత రాజ్యాంగం ద్వారా బాగుపడ్డవారు పీడిత జాతుల విముక్తి కోసం కృషి చేయాలి

  ఈ సమాజమంతా దుర్మార్గమైనది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ దళితులను హింసించడం, దారుణంగా అవమానించడం తమ హక్కుగా భావించే ఒక వ్యవస్థ కొనసాగుతున్నది. ఆ దుర్మార్గాన్ని సమర్ధించుకోవడానికి చూపే సాకులు వాంతి తెప్పించేలా వుంటాయి.
    చదువులేని అగ్రకుల వ్యక్తులకు కనీస పరిజ్ఞానం వుండదనుకుందాం. కానీ బాగా చదువుకున్న, బాగా చదువు చెప్పే వాళ్లకేమైంది? యుజిసీ ఈక్విటీ నిబంధనల విషయంలో వాళ్ల వాదన చూశాము కదా. నిబంధనలు దుర్వినియోగం అవుతాయట.
    పై కుల విద్యార్థులు యూనివర్శిటీలలో చేరాలంటే భయపడుతారట. క్రిమినల్స్ అనే నిందార్హులుగా ముద్రవేయబడుతారట. ఇదీ వీళ్ల తెలివి.
    భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, సాక్ష్యాధినియమం వుండటం వల్లనే నేరాలు జరుగుతున్నాయి, అవి లేకపోతే నేరాలే జరిగేవి కావు అని వాదించే మూర్ఖ శిఖామణులు వీళ్లు.
    ఏది దుర్వినియోగం అవటం లేదు?
    పోలీసులు వాళ్ల అధికారాలను దుర్వినియోగం చేయడం లేదా?
    కలెక్టరు, మంత్రులు, ముఖ్యమంత్రి, అంతెందుకు మోదీ, అమిత్ షాలు చేయట్లేదా?
    వందల యేండ్లుగా బ్రాహ్మణులు తమ తెలివిని దుర్వినియోగం చేయలేదా?
    వ్యాపారులు తమ ధనాన్ని చేయలేదా?
    ఉపా చట్టాన్ని, పిఎంఎల్ఏ, సర్ఫాసి చట్టాన్ని, గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయలేదా?
యుజిసి నిబంధనలను వద్దని వాదన చేసేవాళ్లు యూనివర్శిటీలలో ఆత్మహత్యలు చేసుకొని మరణించిన విద్యార్థుల కుటుంబాల గురించి, వాళ్ల తల్లిదండ్రుల తోబుట్టుల గురించి ఆలోచించి ఒక్క కన్నీటి చుక్కనైనా జారవిడిచారా? ఇంత కర్కోటక గుణం ఈ అగ్రకులాలకు ఎక్కడి నుండి వచ్చింది? కులం వల్లనే కదా? ఇది సిగ్గులేని తనానికి పరాకాష్ఠ.
    అంటారని ప్రజల శారీరక, ఆర్ధిక దోపిడి తమ హక్కుగా సమాజం నేటికి భావిస్తున్నది.మనిషికి మౌలిక అవసరాలైన తిండి,బట్ట,గూడు,వీటి నుండి కూడా దళితులు వంచించబడ్డారు.
    ఐతే కులం,మతం,లేని రోజు వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతున్నదనటంలో సందేహం లేదు.
    శాస్త్రాలు,పూజలు,అంటూ ప్రజలను,ప్రధానంగా అంటరాని వారిని బ్రాహ్మణులు ఎలా మోసం చేస్తున్నారో,ఎంత మాయ చేస్తున్నారో ఇంకా మనకి ఎప్పటికీ తెలుస్తుంది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే....
    అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే చివరికి అన్యాయం చేసే గ్రంథంగా మారిపోతుందని నాకు అనిపిస్తుంది. కోర్టుల తీరు చూస్తే ఇలాగే ఎవరికైనా అనిపిస్తుంది.
    భారత రాజ్యాంగం ద్వారా బాగుపడ్డవారు పీడిత జాతుల విముక్తి కోసం కృషి చేయాలి.
    కానీ దురదృష్టం ఏమిటో కానీ రాజ్యాంగ పలాల వల్ల బాగుపడ్డ వారు, జాతుల చైతన్యం కోసం నడిచిన వారంతా ఎందుకో ఏమో గానీ అంబేద్కర్ కు,ఆయన ఆశయాలకు మోసం చేసిన వారిగానే మిగిలిపోతున్నారు..!
    ఎందుకో మరి...?
   మిత్రులారా...! మీ స్పందన కూడా తెలియచేయండి...!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

  1. ఇక్కడ దేవుళ్ళ ను తీసుకోచ్చి కూర్చోపెడుదామనుకుంటే, దానికంటే ముందుగానే దెయ్యాలోచ్చి కూర్చున్నాయి.
    --- డా. అంబేద్కర్ గారు.
    అన్నగారు అంబేద్కర్ గారి పై మాటల ప్రకారంగా... ఈ దేశంలో చట్టసభల్లో, అడ్మినిస్ట్రేషన్ లో, న్యాయవ్యవస్థలో ప్రతి డిపార్ట్మెంట్ పై స్థాయి అధికారాల్లో మనువాదా దెయ్యాలే కూర్చుని ఉన్నాయి, అందుకే వారి మనువాద బుద్ధితో ఎక్కడ ఎలా మెలికపెట్టాలో తెలిసిన ఇంటలెక్చ్యువల్ ప్రాస్టిట్యూట్స్ వాళ్ళు అందుకే మనకిలాంటి పరిస్థితి ఎదురవుతుంది కారణంగా అలా అనిపిస్తుంటది అంతే కానీ అది నిజం కాదన్న. ఆ స్థాయికి వెళ్ళేవారి సంఖ్య పెరగాలి మనది అప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి. అందుకే ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్.. నీ పాటించాలి. బాబాసాహెబ్ చెప్పినట్టు

    ReplyDelete

Post a Comment