Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

తెలంగాణ ఉద్యమకారులతో సహా, తెలంగాణా ఉద్యమాన్ని నడిపిన కోదండరాం లాంటి వారినే రోడ్డుపాలు జేసిన చరిత్ర మన తెలంగాణ పాలకులది....!

   భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమించిన నాటి పీపుల్స్ వార్ పార్టీ భూస్వాముల భూముల్లో ఎర్ర జెండాలు పాతి, పేద ప్రజలకు భూములు పంచితే లోకల్ పీపుల్స్ వార్ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టి జైల్లో పెట్టారు.
   తిరుగుబాటు చేసిన కొంత మందిని ఎన్ కౌంటర్ చేశారు.
   అదే విధంగా తెలంగాణ స్వరాష్టం కోసం ఉద్యమం చేసి సాదించుకొన్నా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు పీపుల్స్ వార్ పంచిన భూములన్నింటికి ప్రభుత్వం, భూస్వాముల, భూములకు పట్టాలిచ్చి రైతు బంధు పేరిట డబ్బులిస్తోంది.
   కానీ భూమి కోసం పోరాటం చేసిన ఉద్యమ కారులకు దక్కిన గౌరవం ఏమిటో... అందరికి తెలిసిందే...!
   ఉద్యమ వీరులకు భార్య, పిల్లల నుండి, సమాజం నుండి అవహేళన, అవమానం, బహుమానంగా దక్కాయి..!
   చదువుకు తగ్గ ఉద్యోగం, ఉపాధి లేక ప్రస్తుతం ఏమి చేయాలో తోయక రోడ్డున పడ్డ ఎంతోమంది కామ్రేడ్స్ ను ప్రస్తుతం మనం చూస్తున్నాం.
   అదే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, రైతులు, మహిళలు, సబ్బబండ వర్గాల ప్రజలు, పోరాటం చేసి తెచ్చుకున్నా తెలంగాణలో తెలంగాణ ద్రోహులకే లాభం జరిగింది.
   చదివిన చదువుకు ఉద్యోగం రాక, వయస్సు మీద పడి మరో పని చేయలేక ఉద్యమకారులు అనేక అవస్థలు పడుతున్నారు.
   తెలంగాణ ఉద్యమ సమయంలో కేసుల పాలైన వారి గోస, ఘోరం, వర్ణనాతీతం.
   ఉద్యమ సమయంలో ప్రాణాలొదిన కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలబడి, మరి కొంత మందిని గాలికొదిలేసింది...!
   పైగా తెలంగాణ ద్రోహులకు పట్టం కట్టింది...!
   పీపుల్స్ వార్ నేతృత్వంలో భూమికోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వారు దళిత, బహుజన, పేదలే.....!
   తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది దళిత బహుజనులే...!
   అప్పుడు... ఇప్పుడు రోడ్డుపై పడ్డది దళిత బహుజనులే...!
   మరి మీకే ఎందుకు ఇలా జరుగుతుందో మిరే అర్థం చేసుకోవాలి.
   ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఉద్యమ కారులు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో అర్థం చేసుకోనన్ని రోజులు మన జీవితాలు ఇలానే ఉంటాయి...!
   తెలంగాణ రాష్ట్రం మొస్తే బతుకులు బాగుపడతాయని చెప్పిన వారు మాత్రం కోట్లకు పడుగెత్తారు.
   తెలంగాణ ఉద్యమకారులతో సహా, తెలంగాణా ఉద్యమాన్ని నడిపిన కోదండరాం లాంటి వారినే రోడ్డుపాలు జేసిన చరిత్ర మన తెలంగాణ పాలకులది....!
(కాదంటారా...? చర్చ చేయండి...!)
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

  1. అన్ని పోరాటాలు చేసింది కేవలం దళిత, బహుజనులు మాత్రమే అని రాయడం పచ్చి అబద్దం. పీపుల్స్ వార్ లో ఎందరో రెడ్డిలు ప్రాణాలు కోల్పోయారు. CPI నుంచి peopleswar దాకా నాయకులు రెడ్డీ లే. కోటేశ్వరరావు ది ఏ కులం? గణపతిది ఏ కులం? గద్దర్ను తయారు చేసిన మనిషిది ఏ కులం? Ambedkar పేరుతో మీలాంటి కొందరు అన్ని పోరాటాల్లో ప్రాణాలు అర్పిస్తున్నది బహుజనులే అని రాయడం అర్థం లేనిది. అవగాహనా రాహిత్యం. విప్లవ పోరాటం కుల, మతాలకు అతీతం.

    ReplyDelete

Post a Comment