Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అబద్ధాన్ని నిజమని,నమ్మించడం సులువైపోయింది...!

       ఈ దేశంలో అబద్ధాన్ని నిజమని,నమ్మించడం సులువైపోయింది...!

  కానీ...!

      నిజాన్ని నిజమని,నమ్మించడమే ఎంతో కష్టంగా మారింది...!

   ఎందుకంటే...! 

         ఈ దేశంలో గొప్ప మతాలుగా పేరొందిన హిందూ, ముస్లిం,క్రీస్తవ మతాలు ప్రజల మెదళ్లను, దేవుళ్ళపేరుతో  ఆధీనంలోకి తీసుకొని  హింసకు గురి చేస్తున్నాయి ..! బ్రాహ్మణుడు, పాస్టర్, ముస్లిం మత పెద్దలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు....!

  అందుకే ఈ దేశంలో మెజార్టీ సమాజం అజ్ఞానులుగా మిగిలిపోయారు...!

   ఇంకా ఏన్నేళ్ళు ఇలా అజ్ఞానులుగా ఉందామో... ఆలోచించండి....!

                                                   బండి మొగిలి,

                                                     న్యాయవాది,

                                                   9989602566.



Comments

  1. అవును. ..మీరు చెప్పింది నిజం అన్నా !అందుకే నిజం కూడా నిరంతరం ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్దమే నిజమవుతుంది!

    ReplyDelete
  2. వీళ్ళ మెదడులో దేవుళ్ళను జోప్పించినట్టు అంత ఈజీ గా...హక్కులు...అధికారాలు..ప్రశ్నించడం... నేర్పించలేకపోతున్నాం.

    ReplyDelete
  3. Great words sir , marpu ravali

    ReplyDelete
  4. Psychological honesty change is required now

    ReplyDelete
  5. అన్న జై భీమ్ చాలా అద్భుతంగా వివరించారు ఈ మధ్య కొత్త దేవుళ్ళు రానందుకు సంతోషించు

    ReplyDelete

Post a Comment