Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కేసీఆర్ దళిత బందు పథకం ప్రకటించగానే మిగితా సామాజిక వర్గాలకు సోయి వస్తుంది....!

 


ఈ దేశంలో దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయని....! ఉద్యోగాలు ఉన్నాయని...! ఇప్పటికీ.... ఎప్పటికీ.....! ఏడ్చే....!

 నా సోదరులారా.....!

   ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకు దళితుల శ్రమ లేకుండా, మిగతా వర్గాలకు "ముద్ద" దొరుకుతుందా...?

   అన్ని పార్టీలు దళిత ఉద్ధరణ కోసం అనేక పథకాలు ప్రవేశ పెడతాయి....!

   కానీ దళితుల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటది....!

   అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొందిన బుద్ధిజీవులు ఆయా వర్గాలను విస్మరించాయి....!

దళితులను బాగు చేద్దామని ఓట్లు వేయించుకున్న అన్ని రాజకీయ పార్టీలు అనేక పథకాలకు రచన చేసి  ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే, మొండిచేయి చూపడం 75 ఏళ్లుగా జరుగుతున్న తంతే.....!

    కాగా...!

    కేసీఆర్ దళిత బందు పథకం ప్రకటించగానే మిగితా సామాజిక వర్గాలకు సోయి వస్తుంది....!

 మాకు బీసీ బందు కావాలి...!

 మాకు రెడ్డి బందు కావాలి.....!

 మాకు బ్రాహ్మణ బందు కావాలి..!

 మాకు వైశ్య బందు కావాలి...!

ఇలా అందరూ దళితులకు ఏ పథకం పెట్టినా... !

విమర్శలే...... విమర్శలు..... !

   కానీ....!

 ముదిరాజులకు చాపల పథకం పెడితే మేము అడిగామా....?

 గొల్ల కుర్మలకు గొర్లు ఇస్తే మాకెందుకియ్యరని ఆడిగామా...?

  బ్రాహ్మణులకు దీపారాధన కోసం నిధులు కేటాయిస్తే ఎందుకిచ్చారన్నామా...?

రెడ్డోళ్లకు రిజర్వేషన్లు ఇస్తే మేం ప్రశ్నించామా...?

  మరి...!

   మీకెందుకు మాపై ఇంత కుళ్ళు, కళ్ళ మంటతనం....!

 ఐనా...!  ఎవ్వడు ఏమి ఇయ్యలే....?

   చూశారు కదా...!

  ఎన్నికల సంఘం ఆపింది, లేకుంటే ఇచ్చేది ఉండే... !

 ఓట్లు అయిపోయాక తప్పకుండా ఇస్తాం....!

   బెంగ వద్దు అని అధికార పార్టీ చెప్పి ఓట్లు వేసుకొన్న తర్వాత మేము మూడెకరాల భూమి ఇస్తానన్నామా...?

 అన్నట్లుగానే దళిత బందు కూడా ఇవ్వక పోవచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు...! 

    కాబట్టి దళిత సోదరులారా ప్రభుత్వాలు ఇచ్చే ఏ పథకమైన మనకు హక్కుల ద్వారానే వస్తున్నాయి...!

   కానీ పథకాల కోసం కాకుండా అధికారం సాధించడం కోసం మనువాదా పార్టీలకు ఓట్లు వేయకుండా బహుజన పార్టీలకు ఓట్లు వేసే విధంగా సోయి తెచ్చుకొని అధికారం పొందడం కోసం  ప్రయత్నాలు మొదలెట్టండి....!

   *********************************

                                                బండి మొగిలి,

                                                  న్యాయవాది,

                                                9989602566.



Comments

  1. సమ న్యాయం, పరస్పర మైత్రీభావన, సంక్షేమ దృక్పథం అభిలషణీయం. జయహో🙏

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు సార్ అగ్రకులాలకు చెంపపెట్టు మీ మాటలు ఇక నైనా సోయి తెచ్చు కోవాలి 🙏🙏🙏🙏జై భీమ్ సార్ ✊️🤝🤝

      Delete

Post a Comment