Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయకపోతే నన్ను ఉరితీయండి.

 




భూర్జువా పార్టీల నేతలు ప్రజలను రెచ్చగొట్టి, వారిని మోసం చేసి ఓట్లు వేసుకోవడం కోసం కొన్ని సవాళ్లు చేస్తుంటారు....!

వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయకపోతే నన్ను ఉరితీయండి...!

    అని అన్న ఈ దేశ ప్రధాని..! అదే పీఠం మీద ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా కూర్చొని ఉన్నారు...!

   ఆ పని చేయలేక నిస్సాయుడిగా మిగిలిపోయారు...!

 ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షలు రూపాయలు వేస్తాన్నాన్న  ఆ పెద్దమనిషి నిజాయితీని ఏమని పిలుస్తాం....!

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్యలు, లైంగిక దాడులు, కిడ్నాప్లు, దళితులపై దాడులు అత్యధిక సంఖ్యలో జరుగుతున్నాయి...!

    వాటికి బాధ్యులైన వారు దేశ ప్రజలను ఉద్దేశించి వివరణ ఇవ్వాలి కదా....?

   మరి ఏమైంది...!

ఈ దేశంలో పన్ను చెల్లింపు దారుల డబ్బును వివిధ బ్యాంకుల్లోంచి దోచుకొని పారిపోయిన భారతీయ వ్యాపారవేత్తలు, ముఖ్యంగా 28 మంది ఉన్నారు...!

వీరిలో ఒక ముస్లింలేడు, ఒక్క దళితుడు లేడు, బహుజనులు లేరు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు ఉన్నారా...! అంటే వాళ్లు కూడా లేరు...?

మరి ఎవరు ఉన్నారంటే...!

 కేవలం గుజరాత్ కు చెందిన వారే అందరూ ఉన్నారు...!

   వీరంతా కలిసి దోచుకున్నది పది లక్షలు కాదు నాయన, 10 లక్షల కోట్లు మాత్రమే...!

   మరి ఈ దేశానికి కాపాలదారు ఏమైయ్యాడు...? ఇంకా చాయ్ పట్టుకొని తిరుగుతున్నాడా...? లేక దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడా...?

లేక దేశీయ సంస్థల్లి ప్రైవేటు వారికి అమ్ముకుంటూ కలియ  తిరుగుతున్నాడా...?

పాలకులు ఏమయ్యారు...? వ్యవస్థలేమయ్యాయి...?

   దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాల్లో ఈ దేశాన్ని ఏ సముద్రంలో ముంచబోతున్నారు...?

     ******************************


                                            బండి మొగిలి,

                                              న్యాయవాది,

                                            9989602566.



Comments

  1. మీలాంటి వారు చట్ట సభలో ఉండాలి అన్న

    ReplyDelete
  2. Fact said uncle, but who is going to ask, even opposition leaders are not in the track, state leaders are busy in safeguarding their positions and properties.
    It's a simple theory followed by central people..
    Just take out their food then they will be busy in earning it at any cost, therefore they forgot the questioning right... so simple..

    ReplyDelete

Post a Comment