Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
దళిత బంధు పథకం హుజురాబాద్ ఎన్నికల కోసం కాదు... ! జిల్లా కలెక్టర్...!
ఇది దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, గత మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల సంఘానికి తెలిపారు...!
కానీ...!
అయ్యా కలెక్టర్ గారు...!
మీకు ఒక ప్రశ్న....?
అదేమిటంటే...?
గత మార్చిలో 1000 కోట్లు కేటాయిస్తే హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఒక హుజురాబాద్ నియోజకవర్గ దళితులకు మాత్రమే ఎందుకు డబ్బులు డిపాజిట్ చేశారు....? అనేది మా ప్రశ్న... ?
దళిత బంధు ఒకడు ఇస్తా అంటాడు....!
మరొకడు ఆపమని అంటాడు...!
ఇది ఉద్యమ తెలంగాణలో పాలక పార్టీలు దళితుల తో ఆడుతున్న ఎన్నికలాట....?
స్వయంగా జిల్లా కలెక్టర్ గారు అధికార పార్టీ నేతలు ఎలా చెబితే అలా వ్యవహరించడాన్ని దళిత ప్రజలు ఏమనుకోవాలి....?
గత మార్చి నెలలో దళితుల కోసం వెయ్యి కోట్లు కేటాయించామని ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కలెక్టర్ గారు 17 నెలల కాలంలో ఈ పథకానికి ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయలేదో మీరు చెప్పగలరా....?
నిజంగా దళితులకు గత సంవత్సరం మార్చిలో కేటాయించిన నిధులతో మూడెకరాల భూమి పథకానికి 1000 కోట్లు నిధులు కేటాయించామని, గోల్కొండ కోట లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎంపికైన 15 మంది ఎస్సీ మహిళలకి స్వయంగా ముఖ్యమంత్రి గారే భూమికి సంబంధించిన పట్టా కాగితాలు ఇచ్చారు....!
ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నే మేము మూడెకరాల భూమి ఇస్తామని చెప్పలేదు అంటున్నారు....!
మరి భూమి ఇస్తానని చెప్పనప్పుడు ఆ 15 మంది ఎస్సీ మహిళకు భూపంపిణీ పత్రాలు ఎందుకిచ్చినట్లో....?
మీకు ఏమైనా తెలిస్తే కొంచెం ఇగురంగా చెప్పండి సారు...!
తెలంగాణ కావాలని దళిత కళాకారులు పాటలు పాడారు....!
దళిత కవులు పాటలు రాశారు...!
దళిత కళాకారులు పాటలు రాయకుండా, పాటలు పాడకుండా, తెలంగాణ ఉద్యమ పాట, ఉధృతి లేనేలేదు....!
తెలంగాణ కళాకారులంతా దాదాపుగా దళిత బహుజన ప్రజలే...!
తెలంగాణ కళాకారులను, పార్టీ కార్యకర్తలుగా మార్చుకుని వారి గొంతు నొక్కి, వారిని ప్రజా పాటలకు దూరం చేశారు...!
ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తీరు...!
కాబట్టి దళిత ప్రజలారా ఆత్మగౌరవంతో బ్రతకడం కోసం ప్రయత్నాలు మొదలు పెడితే భవిష్యత్తు మీదే...!
***********************************
బండిమొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps

Nice explanation
ReplyDeleteVery nice report Sir
Deleteనిజంగా ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని అనుకుంటే ఎవరు ఆపలేరు. ఉప ఎన్నికల తరువాత 10 లక్షలు ఇచ్చి చిత్త శుద్ధి గా వ్యవ హరించ వచ్చు.అందరి విమర్శకుల కు సమాధానం చెప్పొచ్చు.
ReplyDelete