Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

దళిత బంధు పథకం హుజురాబాద్ ఎన్నికల కోసం కాదు... ! జిల్లా కలెక్టర్...!


దళిత బంధు పథకం హుజురాబాద్ ఎన్నికల కోసం కాదు... !

    ఇది దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, గత మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల సంఘానికి తెలిపారు...!

   కానీ...!

    అయ్యా కలెక్టర్ గారు...!

 మీకు ఒక ప్రశ్న....?

 అదేమిటంటే...?

  గత మార్చిలో 1000 కోట్లు కేటాయిస్తే హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఒక హుజురాబాద్ నియోజకవర్గ దళితులకు మాత్రమే ఎందుకు డబ్బులు డిపాజిట్ చేశారు....? అనేది మా ప్రశ్న... ?

   దళిత బంధు ఒకడు ఇస్తా అంటాడు....!

 మరొకడు ఆపమని అంటాడు...!

  ఇది ఉద్యమ తెలంగాణలో పాలక పార్టీలు దళితుల తో ఆడుతున్న ఎన్నికలాట....? 

    స్వయంగా జిల్లా కలెక్టర్ గారు అధికార పార్టీ నేతలు ఎలా చెబితే అలా వ్యవహరించడాన్ని దళిత ప్రజలు ఏమనుకోవాలి....?

   గత మార్చి నెలలో దళితుల కోసం వెయ్యి కోట్లు కేటాయించామని ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కలెక్టర్ గారు 17 నెలల కాలంలో ఈ పథకానికి ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయలేదో మీరు చెప్పగలరా....?

    నిజంగా దళితులకు గత సంవత్సరం మార్చిలో కేటాయించిన నిధులతో మూడెకరాల భూమి పథకానికి 1000 కోట్లు నిధులు కేటాయించామని, గోల్కొండ కోట లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎంపికైన 15 మంది ఎస్సీ మహిళలకి స్వయంగా ముఖ్యమంత్రి గారే భూమికి సంబంధించిన పట్టా కాగితాలు ఇచ్చారు....!

   ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నే మేము మూడెకరాల భూమి ఇస్తామని చెప్పలేదు అంటున్నారు....!

 మరి భూమి ఇస్తానని చెప్పనప్పుడు ఆ 15 మంది ఎస్సీ మహిళకు భూపంపిణీ పత్రాలు ఎందుకిచ్చినట్లో....?

మీకు ఏమైనా తెలిస్తే కొంచెం ఇగురంగా చెప్పండి సారు...!

     తెలంగాణ కావాలని దళిత కళాకారులు పాటలు పాడారు....!

    దళిత కవులు పాటలు రాశారు...!

 దళిత కళాకారులు పాటలు రాయకుండా, పాటలు పాడకుండా, తెలంగాణ ఉద్యమ పాట, ఉధృతి లేనేలేదు....!

  తెలంగాణ కళాకారులంతా దాదాపుగా దళిత బహుజన ప్రజలే...!

  తెలంగాణ కళాకారులను, పార్టీ కార్యకర్తలుగా మార్చుకుని వారి గొంతు నొక్కి, వారిని ప్రజా పాటలకు దూరం చేశారు...!

 ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ  తీరు...!

 కాబట్టి దళిత ప్రజలారా ఆత్మగౌరవంతో బ్రతకడం కోసం ప్రయత్నాలు మొదలు పెడితే  భవిష్యత్తు మీదే...!


       ***********************************

                                            బండిమొగిలి,

                                             న్యాయవాది,

                                           9989602566.



Comments

  1. నిజంగా ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని అనుకుంటే ఎవరు ఆపలేరు. ఉప ఎన్నికల తరువాత 10 లక్షలు ఇచ్చి చిత్త శుద్ధి గా వ్యవ హరించ వచ్చు.అందరి విమర్శకుల కు సమాధానం చెప్పొచ్చు.

    ReplyDelete

Post a Comment