Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

నాతో శృంగారం చేయండి...!

 


నాతో శృంగారం చేయండి...! నాలో ఉన్న శక్తులన్ని మీలో ప్రవేశిస్తాయని నమ్మించి 11 మంది మహిళపై నల్గొండలో అత్యాచారం చేసిన విశ్వచైతన్య అనే బురిడీ బాబా పోలీసుల అదుపులో ఉన్నాడు...!
   దేశంలోని కొంత మంది బాబాలు, పీఠాధిపతులు, భక్తి పేరుతో వ్యభిచారం, బలత్కారం, భక్తి, ముక్తి పేరిట మహిళలతో సకల సేవలు చేయించుకుంటూ, వారితో శారీరక వాంఛ తీర్చుకుంటూ, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. 
గతంలో సంత రాంపాల్, కంచి శంకరాచార్య, రామ్ రహీమ్ సింగ్, చంద్ర స్వామి, ధీరేంద్ర బ్రహ్మచారి, వీరంతా గతంలో అరెస్ట్ అయిన వారే....!
           మరి...!
దేశంలో వందల సంఖ్యల్లో పెద్ద బాబాలు, వేలల్లో సన్నకారు, చిన్నకారు, బాబాలున్నారు...! 
   మహిళను వేధించి, లొంగదీసుకొని,
 అత్యాచారానికి పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయరు...? 
   జ్ఞాన వంతమైన సమాజం వీరిపట్ల ఆకర్షితులు కావడమే  అసలు సమస్య...!
  ఇంటర్నల్ గా హంతకులుగా, గుండాలుగా, వివిధ దందాలకు తెరతీసి, బయటి ప్రపంచానికి దేవదూతగా, ఆధ్యాత్మిక గురువులు పైకి కనపడుతారు....!
   దేశంలో ఈ తంతు అన్ని మతాల్లో జరుగుతుంది. కానీ సమిదలు మాత్రం మహిళలే...!

 మరి ఇలాంటి నీచపు పనులకు ఒడిగట్టుతున్న బాబాలపై పీఠాధి పతులుగాని, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎందుకు ఖండించడం లేదు...?
   వీరికి మద్దతు గా ఉన్నా మనువాదులెందుకు స్పందించారో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి...!
  భక్తి పేరుతో శూద్ర మహిళలను లోభర్చుకొని  వారితో వ్యాపారం చేస్తున్నా పీఠాధిపతులకు మద్దతు ఇస్తున్న మిమ్మల్లి ఈ దేశానికి పాలకులుగా చేసుకోవడం ప్రజలు చేసిన తప్పే...!
తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, చూడాల్సిన పీఠాధిపతులు మహిళల శరీరాల తో వ్యాపారం చేస్తుంటే  చూస్తున్నా పాలకులనేమానాలి....?
   వారికి వంతపాడుతున్నా రాజకీయ పార్టీలను, ప్రజా ప్రతినిధులను కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉందా...? లేదా..?
    చర్చ చేయండి.....!
    *********************************
                                               బండిమొగిలి,
                                                న్యాయవాది,
                                             9989602566.


Comments

  1. భారతదేశంలో మతం ఒక విధ్వంశం సృష్టించి ప్రజల అజ్ఞానంతో ఆటలాడుకుంటుంది ఇలాంటి చెత్త లంజకోదుకులే.

    ReplyDelete
  2. బాబాల వంటి అలోచన పాలక వర్గం లో వుంటే,మీ వంటి తార్కిక ఆలోచన పీడిత ప్రజల ఆవేదన కు వేదిక అవుతుంది. కానీ విద్యావంతులు బలి అయితే నిరక్షరాస్యులు ను ఎవరు కాపాడాలి.

    ReplyDelete
  3. మతం పేరిట జరిగే అన్ని కార్యక్రమాలు దాదాపుగా మనుషులను, నమ్మకస్తులను అజ్ఞానులుగా తయారు చేస్తాయి.మనిషి ఆలోచన అంతమై పరమపూజ్య అని ఎవరినైతే అభిమానిస్తామో మెదళ్ళన్నీ వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతాయి. మనిషి నమ్ముతున్న దైవాన్ని ( ఆ భ్రమల్లోంచి బయటికి అంత తొందరగా బయటికి రాలేరు కాబట్టి) కేవలం వ్యక్తిగతంగానే వుంచుకోవాలి తప్పా సామాజికం, సాంస్కృతికం, రాజకీయం చేయకూడదు. ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాలే ఇలాంటి మోసపూరిత బాబాలను, సన్యాసులను,
    స్వాములను పెంచిపోషిస్తున్నారు కాబట్టి ఇవి ఇలా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇంత దారుణాలు జరిగాక కూడా మళ్లీ లోపాయకారిగా వారికి అండదండలు అందిస్తూ శిక్షలు పడకుండా తప్పిస్తుంటారు. భక్తులు అనుకున్నవారే వాళ్ళ విపరీత కోరికలు, ఇష్టాలు, ఆలోచనల్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఇవి అందరి ఇష్టప్రకారమే జరుగుతున్న తంతులు. బండి మొగిలన్న గారి ఆవేదన అర్ధం చేసుకోవాలే. జ్ఞానాన్ని పెంచుకోవాలి. సమాజాన్ని అందరూ కాపడాల్సిన అవసరం ఉంది

    ReplyDelete
  4. It is a good topic and excellent information, you gathered and explained

    ReplyDelete

Post a Comment