Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఒక్కడు కన్నతల్లిపై, మరొక్కడు చెల్లి, ఇంకొకడు కన్నకూతుళ్లపై

 

ఒక్కడు కన్నతల్లిపై, 

మరొక్కడు చెల్లి, 

ఇంకొకడు కన్నకూతుళ్లపై  అఘాయిత్యానికి పాల్పడి జైలుకెళ్లినా నిందితుల్లో భయం లేదు...!

   ఎందుకంటే ఉన్న చట్టాల్లో కఠినత్వం లేకపోవడమే ప్రధాన కారణంగా కనపడుతుంది.

 

  పసిపిల్లపై జరుగుతున్నా ఇలాంటి వికృతమైన దాడులను ఎలా ఆపాలి..? 


    మానవ ఆలోచనలు ఇలా మారడానికి కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

   పసిపాపలను కూడా ఒదలని మానవ మృగాలకు ఏలాంటి శిక్షలు వేస్తే ఈ దారుణాలు అగుతాయో అంతు బట్టడం లేదు.

  వరంగల్ లో పూజిత పై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు జైలుశిక్ష అనుభవిస్తున్నాడు...!

  ముందుగా నిందితుడికి మరణశిక్ష వేసినా...!

  కొన్ని హక్కుల సంఘాల అభ్యంతరం తో ఉరిశిక్ష రద్దుచేసి యవజ్జివ శిక్షగా మారింది.


   అంతేకాకుండా హజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి భారతంలో బకాసురుడు రోజుకో బర్రెను తిన్నట్లు శ్రీనివాస్ రెడ్డి రోజుకో విద్యార్థినిని హత్యాచారం చేసి హత్య చేసి చివరి చూపుకు కూడా నోచుకోని  పరిస్థితి కల్పించిన శ్రీనివాస్ రెడ్డిని దున్నపోతును పెంచినట్లు పెంచి పోషిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి...? 


   ఇలాంటి సంఘటనలు చూసిన ప్రజలకు చట్టంపై నమ్మకం పోతుంది...!


   అమ్మాయిలు బయటకెళ్లు ఇంటికి వస్తుందా...? అన్నా నమ్మకం తల్లిదండ్రుల్లో సన్నగిల్లింది...!

 మరి ఇంత బేలాగా ఉన్న చట్టాలను మార్చాల్సిందేనా...? అంటే కచ్చితంగా మార్చుకొని కఠినాతి కఠినంగా శిక్షలుండాలని ప్రజలు కోరుకుంటున్నారు.


    ఒకటా..? రెండా...? ప్రతి రోజు  హృదయాలను పిండి పిప్పిచేసే ఇలాంటి సంఘటనలు చూసి బాధితుల గుండె జరిపోతుంది...!

   నిత్యం దేశంలో ఎదో ఒక చోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

 కొంతమంది మృగాళ్లు అమ్మాయిలనుఅపహరించి హత్యాచారాం చేసి వారి మిత్రుల తో కూడా చేపించి పైచాచిక ఆనందాన్ని పంచుకొన్న తర్వాత శరీరంలోని ఒక్క భాగాన్ని నరికి కుప్పలుగా పోసిన సంఘటన కోకొల్లలు....!


   ఈదేశంలో ఏమిజరుగుతున్నది...?

    స్త్రీలకు రక్షణ లేదు..! రక్షణ గురించి కొత్తగా ఆలోచించికోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రేమించి మోసం చేసిందని ఒక్కడు,

నన్ను ప్రేమించి మోసం చేసిందని ఒక్కడు...!

  బండెక్కలేదని, 

  బట్టలు కొనివ్వలేదని ఎన్నోన్నో కారణాలతో అమ్మాయిలమీద దాడులు చేస్తున్నారు.

    చివరికి పసిపాపలను కూడా ఒదలని వేదవలను కచ్చితంగా ఉరిశిక్ష విధించి మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది...!

                                                   జై భీమ్,

                                                బండి మొగిలి,

                                                  న్యాయవాది,

                                                9989602566.

Comments

Post a Comment