Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
ఒక్కడు కన్నతల్లిపై, మరొక్కడు చెల్లి, ఇంకొకడు కన్నకూతుళ్లపై
ఒక్కడు కన్నతల్లిపై,
మరొక్కడు చెల్లి,
ఇంకొకడు కన్నకూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడి జైలుకెళ్లినా నిందితుల్లో భయం లేదు...!
ఎందుకంటే ఉన్న చట్టాల్లో కఠినత్వం లేకపోవడమే ప్రధాన కారణంగా కనపడుతుంది.
పసిపిల్లపై జరుగుతున్నా ఇలాంటి వికృతమైన దాడులను ఎలా ఆపాలి..?
మానవ ఆలోచనలు ఇలా మారడానికి కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పసిపాపలను కూడా ఒదలని మానవ మృగాలకు ఏలాంటి శిక్షలు వేస్తే ఈ దారుణాలు అగుతాయో అంతు బట్టడం లేదు.
వరంగల్ లో పూజిత పై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు జైలుశిక్ష అనుభవిస్తున్నాడు...!
ముందుగా నిందితుడికి మరణశిక్ష వేసినా...!
కొన్ని హక్కుల సంఘాల అభ్యంతరం తో ఉరిశిక్ష రద్దుచేసి యవజ్జివ శిక్షగా మారింది.
అంతేకాకుండా హజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి భారతంలో బకాసురుడు రోజుకో బర్రెను తిన్నట్లు శ్రీనివాస్ రెడ్డి రోజుకో విద్యార్థినిని హత్యాచారం చేసి హత్య చేసి చివరి చూపుకు కూడా నోచుకోని పరిస్థితి కల్పించిన శ్రీనివాస్ రెడ్డిని దున్నపోతును పెంచినట్లు పెంచి పోషిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి...?
ఇలాంటి సంఘటనలు చూసిన ప్రజలకు చట్టంపై నమ్మకం పోతుంది...!
అమ్మాయిలు బయటకెళ్లు ఇంటికి వస్తుందా...? అన్నా నమ్మకం తల్లిదండ్రుల్లో సన్నగిల్లింది...!
మరి ఇంత బేలాగా ఉన్న చట్టాలను మార్చాల్సిందేనా...? అంటే కచ్చితంగా మార్చుకొని కఠినాతి కఠినంగా శిక్షలుండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఒకటా..? రెండా...? ప్రతి రోజు హృదయాలను పిండి పిప్పిచేసే ఇలాంటి సంఘటనలు చూసి బాధితుల గుండె జరిపోతుంది...!
నిత్యం దేశంలో ఎదో ఒక చోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
కొంతమంది మృగాళ్లు అమ్మాయిలనుఅపహరించి హత్యాచారాం చేసి వారి మిత్రుల తో కూడా చేపించి పైచాచిక ఆనందాన్ని పంచుకొన్న తర్వాత శరీరంలోని ఒక్క భాగాన్ని నరికి కుప్పలుగా పోసిన సంఘటన కోకొల్లలు....!
ఈదేశంలో ఏమిజరుగుతున్నది...?
స్త్రీలకు రక్షణ లేదు..! రక్షణ గురించి కొత్తగా ఆలోచించికోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రేమించి మోసం చేసిందని ఒక్కడు,
నన్ను ప్రేమించి మోసం చేసిందని ఒక్కడు...!
బండెక్కలేదని,
బట్టలు కొనివ్వలేదని ఎన్నోన్నో కారణాలతో అమ్మాయిలమీద దాడులు చేస్తున్నారు.
చివరికి పసిపాపలను కూడా ఒదలని వేదవలను కచ్చితంగా ఉరిశిక్ష విధించి మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది...!
జై భీమ్,
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Hang them quickly
ReplyDeleteGovernment is sleep
ReplyDeleteShame on us.
ReplyDelete