Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రజాస్వామ్యం అంటే ప్రజల శక్తి, కానీ కొన్నిసార్లు అదే పేరుతో యువత దారి తప్పుతోంది.

యువశక్తి ఉన్నా :
అభివృద్ధి ఎందుకు మందగిస్తోంది?
బండి మొగిలి,
న్యాయవాది,

   వరంగల్, ఏప్రిల్ 24 (నవ తరంగాలు): భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. వివిధ అంచనాల ప్రకారం దేశ జనాభాలో సుమారు 65% మంది 35 ఏళ్ల లోపు వయసు ఉన్న యువకులు మరియు 27% మంది 15–29 ఏళ్ల మధ్య వయస్సు గల యువత ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద యువశక్తి మన దేశంలో ఉంది.
    ఇదే భారతదేశానికి గొప్ప బలం.ఇంత మంది యువత ఉన్నప్పటికీ, అందరికీ నాణ్యమైన విద్య, సరైన నైపుణ్య శిక్షణ, స్థిర ఉపాధి అవకాశాలు అందడం లేదు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.
    ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి చేసిన ఏ వస్తువైనా అది మన భారత దేశంలో వినియోగంలో ఉంటుంది ముఖ్యంగా యువత ఆ వినియోగంలో ముందుంటున్నారు.
    వినియోగంలో ముందుంటున్న మనం ఉత్పత్తిలో కానీ తయారు చేయడంలో కానీ పొరుగున ఉన్న చైనా తో పోలిస్తే ఎంతో దూరాన ఉన్నాం.
    మన పొరుగున ఉన్న చైనా దేశంలో గత కొన్ని దశాబ్దాల్లో యువతను తయారీ రంగం, పరిశ్రమలు, సాంకేతిక విద్య, ఎగుమతులు, మౌలిక వసతుల నిర్మాణంలో వినియోగించింది.
    అందుకే అది వేగంగా అభివృద్ధి చెందింది. అక్కడ యువత ఎక్కువగా పనుల్లో, నైపుణ్యాభివృద్ధిలో, ఉత్పత్తిలో భాగమైంది.
    కానీ భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది.
    ప్రజాస్వామ్యం పేరుతో యువతను ఎలా నిర్వీర్యం చేస్తున్నారు?
    ప్రజాస్వామ్యం అంటే ప్రజల శక్తి. కానీ కొన్నిసార్లు అదే పేరుతో యువత దారి తప్పుతోంది.
    కుల, మత, ప్రాంతీయ రాజకీయాలతో విభజించడం     నిరుద్యోగ సమస్యల నుంచి దృష్టి మళ్లించడం మద్యం, మత్తు పదార్థాలు, తాత్కాలిక వినోదాలకు అలవాటు చేయించడం ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు పెట్టుకోవడం, ఉద్యోగాల కంటే ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వడం, చదువు కన్నా ఫాలోయింగ్ రాజకీయాలను ప్రోత్సహించడం,ఇలా యువత శక్తి నిర్మాణాత్మక దిశలో కాకుండా, వ్యర్థ దిశలో వెళ్తోంది.
    ప్రతి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి, చిన్న పరిశ్రమలు, స్టార్టప్స్‌కు రుణాలు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందించాలి, యువతను ఉద్యోగార్థులుగా మాత్రమే కాకుండా ఉద్యోగదాతలుగా తయారు చేయాలి, మత్తు పదార్థాలపై కఠిన నియంత్రణ ఉండాలి కులమత రాజకీయాలపై అవగాహన పెంచాలి.
    భారతదేశానికి యువశక్తి అనే అపార సంపద ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపితే ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగడం అసాధ్యం కాదు. కానీ యువతను ఓటు బ్యాంకుగా కాకుండా దేశ నిర్మాణ శక్తిగా చూడాలి.
    యువత చేతుల్లో మొబైల్ మాత్రమే కాకుండా, నైపుణ్యం ఉండాలి.
    నినాదాలు మాత్రమే కాకుండా, అవకాశాలు ఉండాలి.
    అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం.
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments