Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మహిళలు అందరూ ఒక్కటే వర్గమా?

సువర్ణ మహిళా బిల్లు అంటే ఏమిటి :
మహిళా ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ దృక్పథం.
బండి మొగిలి,
న్యాయవాది,

  వరంగల్, ఏప్రిల్ 27 (నవ తరంగాలు) : భారతదేశంలో ఇటీవల “నారీ శక్తి వందన్ అధినియన్” పేరుతో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కొందరు “సువర్ణ మహిళా బిల్లు” అని అంటున్నారు. ఎందుకంటే ఈ బిల్లు మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్నట్లు కనిపించినా, మహిళలలోని వర్గ, కుల, ఆర్థిక అసమానతలను పట్టించుకోలేదు.
   మహిళలు అందరూ ఒక్కటే వర్గమా? లేక మహిళల్లో కూడా దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీ, పేద, కార్మిక మహిళలు ఉన్నారా ?
   మహిళా బిల్లు, అందులో ఏముంది? 2023లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లులో లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో 33% స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదించారు.
   ఇది మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యం.
   కానీ ప్రధాన విమర్శ ఏమిటి? ఈ 33%లో OBC మహిళలకు ప్రత్యేక కోటా లేదు.
   SC/ST మహిళలకు మాత్రం వారి రిజర్వ్ స్థానాల్లో భాగం ఉంటుంది. అంటే, మిగతా 33%లో అధికంగా ఎవరు లాభపడే అవకాశం ఉంది అంటే రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వర్గాల మహిళలు.
  
“అందరు మహిళలకు ప్రాతినిధ్యం” అన్నట్టు మనకు కనిపించినప్పటికీ వాస్తవ కోణంలో మాత్రం అన్ని వర్గాల మహిళలకు ఒకే పరిస్థితి లేదు.

 ఉదాహరణ :
   ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ గ్రామంలో కూలి పని చేసే దళిత మహిళ గిరిజన ప్రాంతంలో విద్యా సదుపాయం లేని మహిళ, ముస్లిం మైనారిటీ మహిళ పట్టణ మధ్యతరగతి చదువుకున్న మహిళ ఇవాళ వీరందరికీ ఒకే సామాజిక శక్తి, డబ్బు, రాజకీయ చేరిక, విద్య, అవకాశాలు ఉన్నాయా అంటే? లేదు.
   అందుకే “మహిళ” అనే పదం ఒక్కటే సరిపోదు.
   డాక్టర్ అంబేద్కర్ మహిళా విముక్తిని సామాజిక సమానత్వంతో కలిపి చూశారు.
 ఆయన ఆలోచనలు :
   కుల వ్యవస్థలో మహిళ స్థానం అంబేద్కర్ తన రచన Castes in India లో కుల వ్యవస్థ కొనసాగడానికి మహిళలపై నియంత్రణ ప్రధాన కారణమని చెప్పారు.
   ఎండోగమీ (తమ కులంలోనే పెళ్లి) కొనసాగించడానికి మహిళల స్వేచ్ఛను అణిచారని వివరించారు.
   హిందూ కోడ్ బిల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు
 మహిళలకు :
   ఆస్తి హక్కు,
   విడాకుల హక్కు,
   వారసత్వ హక్కు,
   దత్తత హక్కు,
   ఇవ్వడానికి హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చారు.
   అంటే మహిళలను ఆయన కేవలం ఓటర్లుగా కాదు, పూర్తి హక్కులున్న పౌరులుగా చూశారు.
   “I measure the progress of a community by the degree of progress which women have achieved.”
   (ఒక సమాజ పురోగతిని మహిళల పురోగతితో కొలుస్తాను) అని అన్నారు.
   రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది.
 ముఖ్య ఆర్టికల్స్ :
   Article 14 – సమానత్వ హక్కు,
   Article 15(1) – లింగ వివక్ష నిషేధం,
   Article 15(3) – మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు,
   Article 16 – ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం,
   Directive Principles – సమాన వేతనం, గౌరవ జీవితం,
   అంటే రాజ్యాంగం సమానత్వం + రక్షణ + ప్రాతినిధ్యం మూడు కోణాల్లో మహిళలకు సంబంధించిన విషయాలు కల్పించబడింది.
   అయితే “సువర్ణ మహిళా బిల్లు”విమర్శ ఎందుకు? ఎందుకంటే భారతదేశంలో కులం, వర్గం, లింగం పరస్పరం కలిసిపోతాయి.
   ఒక దళిత మహిళకు ఎదురయ్యే అణచివేత
   ఒక అగ్రవర్ణ మహిళకు ఉండకపోవచ్చు.
   ఒక పేద బీసీ మహిళకు రాజకీయ టికెట్ దొరకడం కష్టం.
   అదే ధనిక కుటుంబ మహిళకు సులభం.
   అందుకే “రిజర్వేషన్‌లో రిజర్వేషన్ ఉండాలి.”
 అంటే :
   OBC మహిళలకు వాటా,
   మైనారిటీ మహిళలకు ప్రాతినిధ్యం,
   కార్మిక/గ్రామీణ మహిళల భాగస్వామ్యం ఉండాలి.
   వాస్తవానికి సమాజంలో ఒక వ్యక్తి సమస్యలు ఒక్క కారణంతో రావు.
   లింగం + కులం + వర్గం + మతం + ప్రాంతం కలిసి ప్రభావితం చేస్తాయి.
 ఉదాహరణ :
   ఒక ఉన్నత వర్గ మహిళకు లింగ వివక్ష ఉండొచ్చు.
   కానీ ఒక దళిత మహిళకు:
   లింగ వివక్ష,
   కుల వివక్ష,
   పేదరికం,
   విద్యా లోపం,
   అన్నీ కలిపి ఉంటాయి.
   మహిళా బిల్లును ఎలా అర్థం చేసుకోవాలి?
   మహిళల సంఖ్య పెరుగుతుంది, చట్టసభల్లో మహిళా స్వరం పెరుగుతుంది.
   పురుషాధిక్య రాజకీయాలకు సవాలుగా నిలుస్తుంది కానీ సామాజిక న్యాయం ఓబీసీ మహిళలకు ప్రత్యేక హోదా కుటుంబ రాజకీయాల మహిళలకు ఎక్కువ అవకాశాలు రావడం ఉంటాయి.
   పరిష్కారం ఏమిటి?
   మహిళా ప్రాతినిధ్యం ఇలా ఉండాలి:
   33% రిజర్వేషన్ అమలు,
   అందులో BC / OBC ఉపవిభజన, గ్రామీణ, కార్మిక, మైనారిటీ మహిళలకు అవకాశాలు, రాజకీయ శిక్షణ, నాయకత్వ అభివృద్ధి, డబ్బు ఆధారిత రాజకీయాలు లేకుండా చేయాలి.
   మహిళ అంటే ఒకే వర్గం కాదు.
   మహిళల్లో కూడా వర్గాలు, కులాలు, అసమానతలు ఉన్నాయి.
   అందుకే మహిళా బిల్లును కేవలం “మహిళల విజయం”గా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం దృష్టితో చూడాలి.
   డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గం సమానత్వం అంటే అందరికీ ఒకే మాట కాదు; వెనుకబడిన వారికి ముందడుగు వేసే అవకాశం ఇవ్వడం.
   “ప్రాతినిధ్యం అంటే కుర్చీలు నింపడం కాదు, అణచివేయబడ్డ కొన్ని వర్గాల స్వరాన్ని చట్టసభలో వినిపించడం.”
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments