Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

హక్కులు అనుభవించడం ఒక దశ మాత్రమే, ఆ హక్కులను కాపాడటం నేటితరం యొక్క నిజమైన బాధ్యత.

మహనీయుల ఆశయాలు – నేటి తరం బాధ్యత


    సమాజం అభివృద్ధి చెందడానికి వెనుక మహనీయుల త్యాగాలు మరియు వారి చరిత్ర ఉంది. వారి ఆశయాలు కేవలం పుస్తకాలలో చదవడానికి కాదు ఆచరణలో పెట్టాలి.
    అలాంటి మహనీయుల్లో ప్రధానంగా నిలిచే వ్యక్తి B. R. Ambedkar. ఆయన దేశానికి రాజ్యాంగాన్ని అందించడం ద్వారా కేవలం చట్టపరమైన నిర్మాణం మాత్రమే ఇవ్వలేదు... సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే మూల విలువలను నాటాడు.
    భారతదేశంలో వర్ణవ్యవస్థ వల్ల శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఆయన రిజర్వేషన్ విధానాన్ని ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అందుకు రిజర్వేషన్ల ద్వారా విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో సమాన అవకాశాలు దక్కాలని వేల సంవత్సరాలుగా అణచివేతకు పీడనకు గురైన వర్గాలకు అవకాశాలు దక్కాలని రిజర్వేషన్లను తీసుకువచ్చారు. అయితే, నేటి పరిస్థితిని పరిశీలిస్తే రిజర్వేషన్లు అనుభవిస్తున్న కొంతమంది, ఆ హక్కుల మూలాన్ని, ఆ హక్కుల వెనుక ఉన్న బాధను, పోరాటాన్ని, త్యాగాన్ని మరచిపోతున్నారు.
    హక్కులను పొందడమే గాని, వాటిని కాపాడుకోవడం, విస్తరించడం, సమాజంలో మరింత అవగాహన పెంచడం వంటి బాధ్యతలను విస్మరిస్తున్నారు.ఇది కేవలం వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు సామాజిక బాధ్యతను విస్మరించడమే అవుతుంది.
    హక్కులు అనేవి శాశ్వతంగా ఎవరికీ లభించవు. అవి చైతన్యం, పోరాటం, మరియు సంఘటిత శక్తితోనే నిలుస్తాయి. ఈ చైతన్యం లేకపోతే, ఒక తరానికి లభించిన అవకాశాలు తదుపరి తరానికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే సమాజంలో శాస్త్రీయ దృక్పథం తగ్గిపోవడం.
    మహనీయులు మనకు ఇచ్చిన ఆశయాలను అర్థం చేసుకోకుండా, మూడనమ్మకాలలో మునిగి పోతే, ప్రజాస్వామ్య విలువలు బలహీనమవుతాయి.
    ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు సరైన అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం, సమానత్వాన్ని కాపాడటం, ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండటం.
    నేటి తరం ఈ బాధ్యతను గుర్తించకపోతే, రానున్న తరాలు ఒక దారితప్పిన సమాజంలో జీవించాల్సి వస్తుంది. అటువంటి సమాజంలో హక్కులు, సమానత్వం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కేవలం నామ మాత్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
    మహనీయుల ఆశయాలను కేవలం స్మరించడమే కాకుండా వారి త్యాగాలను వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడంతో పాటు ఆచరణలో అవలంబించాలి, అప్పుడు మాత్రమే మహనీయుల త్యాగాలకు బాటలు వేసిన వారిగా చరిత్రలో నిలిచిపోతాము.
    హక్కులను అనుభవించడం మాత్రమే కాదు వాటిని కాపాడాలి. సమాజాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని శాస్త్రీయ దృక్పథంతో అవగాహన పెంచుకొని మరింత స్ఫూర్తితో సమాజ మార్పుకు కృషి చేద్దాం.
    హక్కులు అనుభవించడం ఒక దశ మాత్రమే, ఆ హక్కులను కాపాడటం నేటితరం యొక్క నిజమైన బాధ్యత.
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments