Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు ఇచ్చింది. కానీ ఆ హక్కులు అందరికీ సమానంగా అందకపోవడం మనం ఆలోచించాల్సిన విషయం.


    సామాజిక, స్వేచ్ఛను, సాధించనంత కాలం, చట్టం ద్వారా అందించే ఏ స్వేచ్ఛా మీకు ఉపయోగపడదు.
డాక్టర్ బి,ఆర్. అంబేద్కర్

****************************

    మన ఆలోచన మారితేనే మన సమాజం మారుతుంది.ఈరోజు దేశంలో రోజుకో సంఘం, సంస్థ, రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. పేర్లు కొత్తగా ఉంటున్నాయి, నినాదాలు గొప్పగా వినిపిస్తాయి, కానీ ప్రజల జీవన ప్రమాణాలలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు. కారణం ఏమిటంటే ఈ సంస్థలలో చాలా వరకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను మరిచి, తమ స్వార్థ ప్రయోజనాలకే పరిమితం అవుతున్నారు.
    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు సమాజానికి స్వేచ్ఛ,సమానత్వం, స్వాభిమానం అనే విలువలను అందించారు. కానీ నేడు వారి జయంతులు, వర్ధంతులు కేవలం నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఆ రోజున ప్రాంగణాలు దద్దరిల్లేలా సభలు జరుగుతాయి, ఫ్లెక్సీలు కడతారు, ఫోటోలు దిగుతారు. కానీ మరుసటి రోజు నుండి మళ్లీ పాత పరిస్థితులే కనిపిస్తాయి.
    జ్యోతిరావ్ ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే దంపతులు ఇరువురు ప్రత్యేకంగా శూద్రులకు మరియు స్త్రీలకు విద్య, సమానత్వం కోసం పోరాడారు. పెరియార్ ఈ.వి. రామస్వామి మత మూడ ఆచారాలు,అంధ విశ్వాసాలపై గట్టి పోరాటం చేశారు. సాహు మహారాజ్ వంటి నాయకులు అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. కానీ ఈ మహనీయుల ఆశయాలు మన రోజువారీ జీవనంలో ప్రతిఫలించకపోవడం నిజంగా బాధాకరం.
    ఇప్పటి పరిస్థితుల్లో ఉద్యమం అంటే ఒక సామాజిక బాధ్యతగా కాకుండా, ఒక వేడుకగా మారిపోయింది. మహిళా దినోత్సవం వంటి సందర్భాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతారు, కానీ అదే సమయంలో వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తారు. ఫోటోలు, పేపర్ కవరేజ్, సోషల్ మీడియా పోస్టులు ఇవే ముఖ్యమవుతున్నాయి, కానీ అసలు సమస్యలపై చర్యలు మాత్రం కనిపించడం లేదు.
    సమాజంలో నిజమైన మార్పు రావాలంటే ముందుగా మనిషి ఆలోచనల్లో మార్పు రావాలి. మనం మహనీయుల ఫోటోలకు పూలమాలలు వేసే బదులు, వారి ఆలోచనలను మన జీవితంలో అమలు చేయాలి. కుల వివక్ష, మత అసహనం ఇంకా మన సమాజంలో బుసలు కొడుతున్నాయంటే, అది మనం వారి సిద్ధాంతాలను గుండెల్లో పెట్టుకోలేకపోయినందుకే.
    రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు ఇచ్చింది. కానీ ఆ హక్కులు అందరికీ సమానంగా అందకపోవడం మనం ఆలోచించాల్సిన విషయం. అంబేద్కర్ గారి ఆలోచనలకు వ్యతిరేకంగా మతతత్వం, కులతత్వం రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేయడం ఒక ప్రమాదకర పరిస్థితి. ఈ పరిస్థితి నేటి సమాజంలో స్పష్టంగా బహిరంగంగా రాజ్యమేలుతోంది. వర్ధంతులు, జయంతులు భావజాలాన్ని పెంచే వేదికలుగా ఉండాలి. కానీ అవి కేవలం ఈవెంట్లుగా మారిపోతున్నాయి. ఒక ఫోటోకు దండ వేసి అనంతరం దండం పెట్టడం మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మన బాధ్యత పూర్తయిందని భావించడం సరికాదు. కానీ బాధాకర విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ పరిస్థితి మన సమాజంలో ఉంది.
    “ఆలోచన → ఆచరణ → మార్పు” అనే చైన్ బ్రేక్ అయింది ప్రస్తుతం. మనం ఆలోచనల దగ్గరే ఆగిపోతున్నాం, లేదా వేడుకల దగ్గరే ఆగిపోతున్నాం. జయంతి రోజున కేవలం సభ కాకుండా ఒక చిన్న ఆచరణ కార్యక్రమం like awareness, discussion, action plan “ఒక ఆలోచన – ఒక ఆచరణ” అనే కార్యాచరణకు సిద్ధమవుదాం అందుకు ముందుగా మానసికంగా మనం సిద్ధమయితేనే సమాజాన్ని అటువైపుగా తీసుకెళ్లగలం.
    ఫోటోలకు పూలు వేయడం కంటే, ఆలోచనలకు ప్రాణం పోద్దాం.
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments