Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

పట్టభద్రుల్లో ఎక్కువ మంది పరిశ్రమల ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నది కాదనలేని సత్యం.

   దేశంలో అనేక విశ్వవిద్యాలయాల నుండి లక్షల మంది విద్యార్థులు ఉన్నత,సాంకేతిక విద్యలో పట్టాలు అందుకొన్నప్పటికీ కొన్ని పేరెన్నిక గల కార్పొరేట్ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు లేదని అంటున్నారు...!
   దేశం లో ఉన్న యువశక్తి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నప్పటికీ యువతకు సరైన ఉపాధి,ఉద్యోగాలు దొరకడం లేదన్నది సుస్పష్టం...!
   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటారని కులాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని లెక్కలు పెడుతున్నాయి,అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తున్నాయి.
   తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ లకు ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నప్పటికీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు లేవో ఎవరు అడగాలి.
   ప్రపంచం లోని అన్ని బ్రాండెడ్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని లాభాలు గడిస్తున్నాయని లెక్కలు చెపుతున్నాయి.కానీ ఈ ప్రాంతంలో యువత నిరుద్యోగం తో ఎందుకు ఉన్నారో ఎవ్వరికి అర్థం కాని ప్రశ్నలే...?
   సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు ప్రైవేటు విద్యా సంస్థలకు అందిస్తున్నామని ప్రభుత్వాలు లెక్కలు మాత్రం చెపుతున్నది. మరి ఆయా కళాశాలల్లో చదువుకొన్నా పిల్లలు ఎందుకు నిరుద్యోగం తో ఉన్నారో తెలియని పరిస్థితి.
   డబ్బులు ప్రభుత్వానివైతే, కాలేజీలు మాత్రం ప్రభుత్వాన్ని నడుపుతున్నా వారి బంధువులవి.
   ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ ఖజానా కాజేసి ఆర్ధికంగా ఎదిగితే.....!
   కానీ పట్టాలు తీసుకొన్న విద్యార్థులు మాత్రం కొలువులు లేక రోడ్డున పడుతున్నారు.
   ఉన్నత విద్యా సంస్థల్లో ఆలోచన దృక్పథం మారాలి.కానీ ప్రస్తుత విద్య వ్యవస్థలో ప్రశ్నించే తత్వం కంటే చెప్పిందే రాసే తత్వం పెరిగిపోయింది.
   మన దేశ ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాల ఉత్పత్తులు కొనుగోలు చేసి కేవలం వినియోగదారులుగా మరి పోయారు...! కాదు కాదు...!
   వినియోగదారుల దేశంగా మారిపోయారు.
   మనదేశంలో పట్టభద్రులు డిగ్రీ పట్టా తీసుకొని ఉద్యోగం కోసం పట్టా పట్టుకొని తిరిగే కాగితంలా కాకుండా దేశాన్ని ప్రపంచ పటంలో గొప్పగా ఉండేవిధంగా చూసే బాధ్యత ఎవరిది...?
   సమాజంలో పనిని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి కావల్సిన నైపుణ్యాలను పిల్లకు నేర్పించడం లేదు.చట్టం పై అవగాహన లేదు, సమాజం పై అవగాహన లేదు,
   పట్టభద్రుల్లో ఎక్కువ మంది పరిశ్రమల ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నది కాదనలేని సత్యం.
   దేశ పాలకుల పాలన విధానాలు వల్ల యువత శ్రమశక్తి వృదా కావడమే కాకుండా దేశ పౌరుల భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి ఉంది.
   మిత్రులారా...? మరి మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments