Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

విద్యను వ్యాపారం చేస్తున్నది ఎవరు...?

   తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్ రిపోర్ట్ గురించి విమర్శ చేస్తున్న వారు ఒక్కసారి వాస్తవాలను మరిచి మాట్లాడుతున్నారు.
   కమ్యూనిస్టులు గోడలపై విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాసే రాతలను చిన్నప్పుడు చదివి ప్రభుత్వాలు ఎందుకు విద్యకు నిధులు ఖర్చు చేయడం లేదో అర్థం కాకపోయేది.
   ప్రభుత్వం దేశంలోని దళిత గిరిజనులకు నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలు కల్పించినా ఎందుకు జీవితం లో స్థిరపడలేదో ఇప్పటికీ కొంత మందికి అర్థం కాదు.
   ఇంకా గ్రామాల్లో అన్ని పార్టీలకు కార్యకర్తలుగా చలామణి అవుతూ జీవచ్ఛం లాగా బ్రతుకుతున్నారు...! ఎందుకు....?
   ఎవరన్నా ఆలోచించారా...? లేదు.
   తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ లో ఉపాధ్యాయుల జీతాల విషయంలో సూచన చేశారని అన్ని ప్రతిపక్ష పార్టీలు చైర్మెన్ మురళి సార్ పై విమర్శలు చేస్తున్న నేతలు ప్రభుత్వ బడులు ఎందుకు మూతపడుతున్నాయో ఎప్పుడైనా ఆలోచన చేశాయా...? అంతెందుకు మనం ఎన్నుకొన్న ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకే అనేక ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యను వ్యాపారం చేస్తున్నది ఎవరు...?
   చదువే అన్ని సమస్యలకు పరిష్కారం అని ప్రగాఢంగా నమ్మిన ఆకునూరి మురళి తన చిన్నప్పటి నుండి అనుభవించిన అనుభవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని విద్య వ్యవస్థలో సమగ్ర మార్పుల కోసం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాడల్ పాఠశాలల్లో రిజల్ట్స్ తెచ్చిన గొప్ప మేధావి.
   ఆగ్ల భాషలో ప్రవేశం లేక పోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పసిగట్టిన ఆకునూరి మురళి గారు నర్సరీ నుండి తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఉండాలని ప్రతిపాదన చేయడం కూడా ఉపాధ్యాయులకు, రాజకీయ నాయకులకు ఇబ్బందిగా ఉందట...!
   భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కాలంలో మండలం లోని కమలాాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి మంచి రిజల్ట్స్ తెచ్చిన ఘనత ఆకునూరి మురళి గారిది.
   కమలాపూర్ లో వచ్చిన రిజల్ట్స్ చూసిన సమాజం భూపాలపల్లి జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పట్టాలని దృడ సంకల్పం తో ముందుకెళ్లి ఉపాధ్యాయుల తో చర్చలు జరిపారు.
   కానీ ఉపాధ్యాయులు మాత్రం మేము తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసారు దానికి మురళి గారు విడతల వారిగా ట్రైనింగ్ తీసుకుని ముందుకు పోదామని చెప్పిన తరవాత ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకొన్న సందర్భాన్ని సమాజం మర్చిపోలేదు.
   ఈవిషయం తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గా ఆకునూరి మురళి గారిని బదిలీ చేసి ఆయన లక్ష్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రాధాన్యత లేని ఆర్కలయోజీ శాఖ బదిలీ చేసి అవమాన పరిచిన విషయాన్ని కూడా తెలంగాణ సమాజం మర్చిపోలేదు.
   ఏదేమైనా చదువు సరిగా లేకపోతే భవిష్యత్తు లేదని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తోపాటు ప్రభుత్వ పాఠశాలకు అనేక సవరణలు చేయాలని ప్రతిపాదించిన ఆకునూరి మురళి పైన మానసిక దాడికి పాల్పడుతున్న వారినేమనాలి.
   ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సి, ఎస్టీ బీసీ పిల్లలకు ఇంగ్లీష్ భాషలో ప్రవేశం వద్దేనేది వీరి అభిప్రాయం గా సమాజానికి కనపడుతున్నది.
   ప్రభుత్వం టీచర్ల జీతాలు తగ్గించాలని మురళి సారు చెప్పారా..? దేశంలో ఎక్కడా లేని జీతాలు మన రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు ఇచ్చినా కూడా స్కూల్లో పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
   మా తరం అంతా ప్రభుత్వ బడుల్లో చదివినదే‌. వాటిపట్ల జనంలో ఉదాసీనత ఎందుకు? ప్రభుత్వానికి నిర్లిప్తత ఎందుకు?
   బడులను బాగుచేద్దామంటున్న మురళి సారు మీద విమర్శలెందుకు? ప్రయివేటు బడుల్లో ఫీజుల పేర చేసే దోపిడీని అరికడుదామంటే ఇంత ఉలికిపాటు ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా...?    మిత్రులారా...! మీ స్పందన కూడా తెలియచేయండి...!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

  1. నిజం మాట్లాడినవానికి నిందాలెక్కువ అన్నట్లుంది ఈ సమాజం సార్

    ReplyDelete

Post a Comment