Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రశ్నించడం ఆగిన చోట - ఆలోచన ఆగిపోతుంది.అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది అమ్ముకునే దానికేనా...? చెప్పండి...!

    ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలు, ఓటు అమ్ముకుంటున్నారు,ఓట్లను బహిరంగంగా కొనుక్కుంటున్నారు ...!     పిల్లలకు చదువు నేర్పే ఉపాధ్యాయులు ఓటు అమ్ముకుంటున్నాడు....!!     ఉన్నత విద్య చదివిన గ్రాడ్యుయేట్స్ ఓట్లను అమ్ముకుంటున్నారు...!     న్యాయం కోసం పోరాటం చేసే న్యాయవాది ఓట్లను అమ్ముకుంటున్నారు...!     కష్టం చేసి జీవించే సామాన్యులు ఓటు అమ్ముకుంటున్నాడు...!!!     ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు కూడా తమ ఓటు అమ్ముకుంటూనే ఉన్నాడు...!     మరి ప్రజాస్వామ్యం కోసం ఎవరు పాటుపడాలి...!!     ఈ దోపిడి చేస్తున్నా రాజకీయ వ్యవస్థ ను కంట్రోల్ చేసే విచారణ సంస్థలు కళ్ళు మూసుకొని ఉండటం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకే నష్టం జరుగుతున్నదన్నా విషయం సుస్పష్టం....!     ప్రశ్నించడం ఆగిన చోట - ఆలోచన ఆగిపోతుంది.     అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది అమ్ముకునే దానికేనా...? చెప్పండి...!     దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనబైఎళ్లు కావస్తున్నా ప్రజాస్వామ్యం ఇంకా ఎవరికి అర్థం కాదు.     చట్టాలు ఎవరికి అర్థం కావు.     నేరం చేసిన తర్వాత పలానా కేసు కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నామని జైలుకు పంపుతున్నారు.     చదువుకునే పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించడం లేదు.కానీ మతాల గురించి, దేవుళ్ళ గురించి, దయ్యాల గురించి, గంటలు గంటలు పార్లమెంటు లో అల్లరి చేస్తారు.     ప్రజలకు చట్టాలపై , నేరాలపై అవగాహన కల్పించాలన్న స్పృహ పాలకులకు ఉండదు.     ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, కాంగ్రెస్ గెలుస్తుందా...? లేక బీజేపీ, బిఆర్ఎస్ గెలుస్తుందా...? అన్న చర్చలే గాని ఆ పార్టీల నుండి ఏమి ఆశించి గెలిపిస్తున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి.     రాజ్యాంగాన్ని పాటించని పాలకులను, పార్టీలను,ఎందుకు నెత్తిన పెట్టుకున్నారో మరి...?     ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ భావజాలాన్ని అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎందుకు అనుసరించటం లేదో ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా...?     మనకెందుకులే అని ఒదిలేసిన సందర్భాలే అధికం...!     పేదవారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేతలు,వారి పిల్లలు మోసం చేయడానికైనా...?     రేప్ చేయడానికైనా...? లేకపోతే దోపిడి చేయడానికైనా వెనుకాడేది లేదన్నది నిజం కాదా...?     మీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలను ఎప్పుడూ నాశనం చేసేది...!     దేశంలోని పేదలకు సరైన వైద్యం అందదు, విద్య అందదు,ఉద్యోగం దొరకదు, ఉపాధి అవకాశాలు ఉండవు,చివరికి కాటికి పంపడానికి చిల్లరలేని ఈ బ్రతుకులు ఎలా మారుతాయి.     పనికి తగ్గ పలితం ఉండదు,     భూమి ఉండదు, కూలి దొరకదు     కూలి దొరికిన వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం మద్యం, తదితర వ్యసనాలకు అలవాటు పడేలా అన్ని వసతులు దగ్గరలోనే ప్రభుత్వాలు ఉంచుతున్నాయి.     ఆర్ధిక, దోపిడి, నష్టాలకు కారణమైన ఈ ప్రభుత్వాలను ప్రశ్నించటం, తద్వారా బహుజన సమాజం అధికారంలోకి రావడమే మార్గం తప్ప మరో మార్గం లేదు...!
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments