Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మనిషికి ఙ్ఞానం లేనప్పుడు మోసపోయామంటే ఏమో అనుకోవచ్చు

  
   బీసీ సమాజాన్ని ఎంత వీలైతే అంత కాలం అణిచివేతకు గురిచేయడమే అగ్రవర్ణ పార్టీల, లక్ష్యం...!
   కాంగ్రెస్ బిసిలకు ఎన్నికల సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవడానికి ప్రణాళిక ప్రకారం పని చేస్తూ వచ్చింది. ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి కి పంపింది‌. కానీ బిజెపి ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఒప్పుకోదు కాబట్టి ఆర్డినెన్స్ మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు.
   దీంతో రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో పంచాయతీరాజ్ బిల్లును, మున్సిపాలిటీ బిల్లును ఆమోదించింది. ఆ చట్టాల మీద రాష్ట్రపతి ముద్రపడాలి. బిజెపి కదా ఆ పనిని దగ్గరుండి చేయాలి. కానీ ఆ చొరవ చూపలేదు. ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
   రాష్ట్రపతి నిర్ణయం బిజెపిని కాదని రాదు. హైకోర్టు తీర్పు ప్రకారం స్థానిక ఎన్నికలు జరపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జీవో తప్పా మరో మార్గం లేదు. ఆ జీవోను సవాల్ చేస్తూ కోర్టు తలుపులు తట్టారు అగ్రకులాలు. అందువల్ల కాంగ్రెస్ మినహా బిజెపి, బిఆర్ఎస్ కు బిసిల రిజర్వేషన్ మీద నిజాయితీ వుందని అనుకోలేం...
   మనిషికి ఙ్ఞానం లేనప్పుడు మోసపోయామంటే ఏమో అనుకోవచ్చు. కానీ నిన్ను మనిషిగా ఒక గుర్తింపు పొంది ఎనబై సంవత్సరాల కాలం గడిచిన బీసీల్లో ఇంకా దేబరింపు భావన ఉండటం శోషనీయం.
   ఎంతో మంది మహనీయులు వారి జీవితాలను అర్పించి మన జీవితాల్లో వెలుగునిచ్చిన ఇంకా మన జీవితాల్లో బానిస మనస్తత్వం దూరం చేసుకోలేకపోతున్నామంటే తప్పు ఎవరిది...?
   బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కోసం జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే అగ్రవర్ణ నేతలు అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్న బీసీ సమాజం, మన కోసం కృషి చేసే వారెవరో...?
   ఆలోచన చేయాలి...!
   దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచిన ఇప్పటికీ బీసీ లకు పార్లమెంటు లో రాజకీయ రిజర్వేషన్లు లేవంటే కారణమెవరో బీసీ సమాజం గమనించాలి.
   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చిన 24 గంటల్లో చట్టంలో ఉన్నా లొసుగులను ఏరీ బీసీ లకు రిజర్వేషన్లు ఇవ్వరాదని కోర్టుకు వెళ్ళిన సందర్భం మనం చూస్తున్నాం.
   కానీ పట్టుమని ఏడు ఎనిమిది శాతం కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు EWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా...?
   EWS రిజర్వేషన్ కోటా వల్ల బీసీ లకు జరుగుతున్నా నష్టాన్ని ఇప్పుడు ఇప్పుడిప్పుడే బీసీ సమాజం గమనిస్తుంది.
   చేతి వృత్తులు చేసుకొని జీవిస్తున్న బీసీ కుల వృతులను కూడా దోపిడీ చేసిన అగ్రవర్ణ పెట్టుబడిదారులు ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ను కూడా అడ్డుకోవటం అంటే బీసీలు ఆజన్మాంతం బానిసలుగా,కూలీలుగా ఉండాలన్నదే అగ్రవర్ణ సమాజం ఉద్దేశ్యం .అంతే తప్ప మరోటి కాదన్నది సుస్పష్టం...!
ఈ విషయం పై చర్చ చేయండి....!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments