Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఈ దేశంలో వీర్యానికి, కులం, పేదరికం ఒకటేమిటి...? ఏదైనా అంటగడుతారు.

   బిచ్చగాలైతే ఏంటి...?
   అడ్డకూలిలైతే ఏమిటి...? వారు మనుషులు కారా...? వారి వీర్యానికి పేదరికం అంటగడుతారా...?
   ఈ దేశంలో వీర్యానికి, కులం, పేదరికం ఒకటేమిటి...? ఏదైనా అంటగడుతారు.
   నిజానికి వీర్యంలో బలం ఉండదు స్పెర్మ్ (క్రిములు)ఉంటుంది. కొంత మంది ధనవంతుల్లో స్పెర్మ్ ఉంటుంది. కానీ క్రోమోజోములుండవు కాబట్టే పిల్లలు పుట్టరు. ఎక్కడ అది సమస్య...!
   అంతే కానీ సంపూర్ణ ఆరోగ్యం లేకపోయినా వీర్యం నిండా స్పెర్మ్ ( క్రిములు) కలిగి,వారిలో కొన్ని కోట్ల కొలది క్రోమోజోములున్నా పేదలను,కూలీలను అవమానించడం అలవాటుగా మారిపోయింది...!
   అంతే కాదు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో కులాన్ని నీచంగా చూసే కుల కంపు గల ఇండ్లల్లో ఎక్కువగా పాలేరులు, నిత్య కూలీలు, ఉద్యోగం రాక గ్రామాల్లో ఖాళీగా ఉండే యువకులతో పిల్లలు కన్నా అగ్రవర్ణ స్త్రీలే ఎక్కువ....!
   ఇలాంటి విషయాలు గ్రామాల్లో తెలిసినా పట్టించుకొని కొన్ని జాతులు, సమూహాలు మనకు కనపడుతాయి.
   చట్టాన్ని అమలు చేసే అధికారులకు కూడా వీర్యంలో పేదరికాన్ని చూశారంటే వారు ఎంత గొప్ప మానవతావాదులో చట్టాన్ని అమలు చేసే అధికారులో మాటల్లో చెప్పలేక పోతున్నా...!
   అమ్మ తనానికి దూరమై మానసిక వేదనకు గురవుతున్న తల్లులకు వీర్యాన్ని దానం చేస్తున్న మనుషుల్లో కులం, పేదరికం చూస్తున్నారంటే వారు నిజంగా సంస్కారం లేని వారే అనటంలో సందేహం లేదు.
   అడ్డాకూలీ, బిచ్చగాడి వీర్యంతో జన్మనోందే శిశువు కూడా పేదవాడు అవుతాడా...? ఆగర్భ శ్రీమంతులైన వారు పిల్లల కోసం పడే తపన,బాధ ఇంతా అంతా కాదు.
   సమాజంలో గొప్ప,గొప్ప విలువలు, ఉన్నవారు వారికి పుట్టే పిల్లలు అందరూ అందంగా,ఉంటున్నారా...?
   లేకపోతే అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారా...?
   ఎంతోమంది సంపద కలిగి ఉన్నా కుటుంబాల్లో కూడా మానసిక,అంగవైకల్యం కల వారు ఎంతో మంది ఉన్నారు..! మరి వారి సంగతేమిటి...?
   అడ్డకూలీల వీర్యం, బిచ్చగాళ్ల వీర్యం నిజంగా ఎంతో గొప్పది.విలువైనది. అడ్డకూలీలు నిత్యం ఎండా వానలో కష్టపడి కళోగంజో తాగి రక్తాన్ని చెమటగా మార్చటం వల్ల వారి మానసిక స్థితి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. వారి వీర్యాన్ని అవమానించాల్సిన అవసరం లేదు.
   కాకపోతే బిచ్చగాళ్ల వీర్యాన్ని తీసుకోవటమనేది ఇద్దరికి అవసరమైన పక్రియగానే చూడాలి తప్పా అవమానంగా చూడటమనేది మానవత్వం అనిపించుకోదు...!
   సామాజిక కోణంలో చూసినప్పుడు ( బిచ్చగాళ్లు, అడ్డాకులీలు) ఒకరిది ఆకలీ బాదైతే మరొకరిది సంతానం లేకపోవడమనే మానసిక వేదన...!
   కానీ ఈ దందా నడిపిస్తున్నా వారిలో మానవత్వం లేకపోవడం విచారకరం. వీర్యాన్ని బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకొన్న డాక్టర్లు లక్షల్లో పీజులు గుంజి వీర్యాన్ని ఇచ్చిన వారిని మోసం చేయడం నేరం..? వారిపైన చర్యలుండవు.
   డాక్టర్లు ఎంచుకొన్న వైద్యంలో పిల్లలు లేని వారికి సంతానం కలిగించటమనేది ఇక్కడ మనుషులనేబడే డాక్టర్లు చూడాల్సింది.
   అంతే కానీ వాడు బుచ్చగాడా...? అడ్డాకూలా...? ఇక్కడ అనవసరం....!
   మిత్రులారా మరి మీరేమంటారు....?
ఈ విషయం పై చర్చ చేయండి....!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments