Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

తరతరాలుగా అంటరాని తనం, అవమానాలు, భూమి లేమి తనం నుండి విముక్తి కావడం ఎప్పుడు...?

   మిత్ర బీసీ మైనార్టీ సమాజమా...? ఎంత కాలం అంబేద్కర్, పూలే ఆలోచనలకు సమాది చేస్తారు....!
   ఇతర పార్టీల్లో ఎమ్మెల్యే లు, ఎంపీలు అయ్యి ఆ పార్టీల బలాన్ని పెంచుతారు...! మీరు ఎంత కాలం అగ్రవర్ణ పార్టీల బలాన్ని పెంచితే అంత కాలం అణిచివేతకు బహుజన సమాజం గురి కావాల్సిందే అన్న విషయం ఎప్పుడూ తెలుస్తుంది మీకు...!
   గ్రామాల్లో జీవన వికాసం లేక, ఉన్న పాటి భూములను, ఇళ్లను, గొడ్డు గోదాను వొదిలి కులాన్ని నెత్తిన పెట్టుకొని బ్రతకడానికి నగరాల్లో కావలసిన పని వెతుక్కొని జీవిస్తున్నారు.
   తరతరాలుగా అంటరాని తనం, అవమానాలు, భూమి లేమి తనం నుండి విముక్తి కావడం ఎప్పుడు...?
   అంబేద్కర్ పుణ్యమా...! అని కొంత జ్ఞానం తెచ్చుకొన్న బహుజన సమాజం నిన్ను కులం,పేదరికం వల్ల అవమాన పరుస్తున్న వారి వెంట నీ ప్రయాణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి...!
   అగ్రవర్ణ పార్టీలు రిజర్వేషన్లు ఇస్తామని ఒక పార్టీ,ఎలా ఇస్తారు రాజ్యాంగం ఒప్పుకోదని మరో పార్టీ గత డెబ్బై ఏళ్లుగా సాగదీస్తూ యావత్తు బహుజన సమాజాన్ని ఒక్కటి కాకుండా చూస్తూ వారికి కావలసిన రీతిలో ఎస్సీ, ఎస్టి, బీసీ సమాజాన్ని విడదీస్తూ అధికారాన్ని చెలాయిస్తున్న తీరు నేతలకు, మేధావులకు కనపడుతున్న దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే ఎలా మరి...?
   అమాయక ఎస్సీ ఎస్టి బీసీ ప్రజలను రాజకీయ అంధకారంలోకి నెడుతున్న వారిని ఏమనాలి....?
   బీసీ సమాజం నుండి ఎదిగిన ఆర్ కృష్ణయ్య, ఈటెల రాజేందర్,ఎస్సీ సమాజం నుండి ఎదిగిన మంద కృష్ణ,ఇంకా ఎంతో మందిని ఈ దేశంలో కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్న మతోన్మాద బీజేపీ పార్టీని అక్కున చేర్చుకొని ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నది...!
   ఈ విషయం తెలిసి కిమ్మనకుండా ఉన్న నాయకుల్లో, మేధావులల్లో చలనం ఎప్పుడొస్తుందో....?
   బీసీలు ఎస్సీ ఎస్టి లు వారి శక్తిని గుర్తించాలి.వారిది మానసిక పేదరికమే గాని ఆర్ధికం కాదు.
   రాజకీయ పునాదులు సరిగాలేని సమాజం. నూతన రాజకీయ శక్తిని సమీకరించుకోవటం అసాధ్యం. బీసీల్లో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు కానీ వారు చెల్లాచెదురై ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ లకు ఎవరి దయ,జాలి అవసరం లేదు మీరే మార్గాలను ఎంచుకొని ముందుకు వెళ్తే గానీ రాజ్యం రాదు. ఐతే కొంత మంది త్యాగాలు చేయడానికి ముందుకు రావాల్సి ఉంది.
ఈ విషయం పై చర్చ చేయండి....!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments