Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రతి పక్ష నేతను చూస్తున్నారు.

   అధికార పార్టీని నిలదీసి ప్రజల్లో ఎండగట్టే ప్రతిపక్షాన్ని చూసిన తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఇప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రతి పక్ష నేతను చూస్తున్నారు.
   తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ తన పాలనలో జరిగిన అభివృద్ధి పనులను అసెంబ్లీలో చర్చ చేద్దాం రమ్మని పిలిచినా రాకుండా తప్పించుక తిరుగుతున్నట్టు కనబడుతున్నది.
   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు అసెంబ్లీ కి రావడం ఇష్టం లేకపోతే కేసీఆర్ ఫాంహౌస్ లో చర్చ చేద్దామన్న నేను నా మంత్రి వర్గం తో ఫాంహౌస్ కైనా వస్తానని ప్రకటన చేసినా కేసీఆర్ నుండి స్పందన లేదంటే ఏమనుకోవాలి...?
   కేసీఆర్ తో చర్చ చేయాలంటే కేటీఆర్ ప్రెస్ క్లబ్ కొచ్చి చర్చ చేద్దామనడం అంటే ఏమనుకోవాలి. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు కేటిఆర్ తీసుకొన్నాడనుకోవాలా...?
   అవును కావచ్చు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో కేటీఆర్ మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రి గా ఉన్నప్పటికీ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు చేసింది కూడా తెలంగాణ సమాజం చూసింది.
   అంటే కేసీఆర్ కుమారుడన్నా అర్హత తో ఎంత మేరకు అధికార దుర్వినియోగం జరిగిందో చూసినా ప్రజలు తెలంగాణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు.
   మిగులు బడ్జెట్ లో ఉన్నా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తున్న సంపద వడ్డీలకే సరిపోతున్నదని, అంతేకాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నా కాలంలోఅనేక అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నది.
   కేసీఆర్ ముఖ్యమంత్రి గా తీసుకొన్న నిర్ణయాలు తెలంగాణ కు ఏవిధంగా ఉపయోగ పడ్డాయో నిరూపించుకునే అవకాశం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన కేసీఆర్ అందుకు సిద్ధంగా లేరంటే దోపిడి ఏ స్థాయిలో జరిగిందో అర్థమౌతుంది.
   ఇటీవల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులపై ఈడి విచారణ సందర్భంగా కొన్ని వందల,వేల కోట్ల రూపాయలు దాడుల్లో దొరికాయంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో ఎంత అవినీతి జరిగి ఉంటుందో అర్థం చేసుకోవాలి.
   పేద ప్రజలకోసం కట్టిన డబుల్ బెడ్ రూం పథకం ద్వారా పేదలకు ఇల్లు రాలేదు కానీ కేటీఆర్,కవిత, కేసీఆర్, హరీష్ రావు లకు మాత్రం ఫాంహౌస్ లు వచ్చాయి.
   ఒక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నా కేసీఆర్ 20 నెలలుగా ప్రజాక్షేత్రంలోకి రాకపోవడానికి అనేక కారణాలు చూపుతున్నా కారణాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
   కేసీఆర్ ను ప్రజలు మరిచిపోతున్నారనుకొనారో ఏమో కానీ వరంగల్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదికార పక్షాన్ని పల్లెత్తు మాట అనకుండా తన ప్రసంగాన్ని సప్పగా ముగించాడు.
   ఏది ఏమైనా ఒక ప్రతిపక్ష నేతకు ప్రజల సమస్యలపై స్పందించడానికి సమయం కూడా లేదంటే ,ప్రతిపక్షనేతగా ఆయన ఎందుకున్నట్టో...?
   మిత్రులారా...!
ఈ విషయం పై చర్చ చేయండి....!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments