Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

దేవుడా నీకు తెలివి మతి ఉండే నా తలరాత ఇలా రాసావా...?

   దేవుడున్నాడని, ఆయనే అన్ని చూసుకుంటాడనే నమ్మకంతో కొంతమంది యువతీ యువకులు జీవిస్తున్నారు. అన్ని మతాల్లో ఇలాంటి విశ్వాసం అనేక మందికి ఉన్నదన్న మాట వాస్తవం.
   దేవుడు తలరాతలు రాస్తాడని ఆయన రాసిన రాతవల్లనే జీవితాలు ఆనందంగా ఉంటాయనే నమ్మకం, విశ్వాసంతో ఉన్నా...! కొంతమంది జీవితాల్లో వెలుగులు లేక పోవడం వల్ల దేవుడి పైనే కోపం తెచ్చుకొని వారి తనువును చలించుకొంటున్నారు.
   వేములవాడలో శనివారం జరిగిన సంఘటన చూస్తే ఇరువై ఐదు సంవత్సరాల యువకుడు ఏకంగా దేవుడి కి అనేక ప్రశ్నలు వేసి తనువు చాలించుకొన్న సంఘటన యువతరానికి ఏ సందేశం ఇస్తున్నది.
   దేవుడా నీకు తెలివి మతి ఉండే నా తలరాత ఇలా రాసావా...?
   అదే నీ కొడుకుకు అలా రాయలేదే....?
   మేము నీకొడుకులం కాదా...? ఎందుకు మాతలరాత ఇలా రాసారు...! అని అనేక ప్రశ్నలు వేసి తను బలవ్మరణం చేసుకొన్నాడు.
   ఈసంఘటన సమాజానికి ఏమి సందేశం ఇస్తుంది...!    ఎమెస్సీ చదువుకొన్న యువకుడికి ఉద్యోగం రాకపోవడానికి దేవుణ్ణి కారణంగా చూపించి తను మరణించాడు.
   నాకు ఉద్యోగం రాకపోవడానికి ప్రధాన కారణం దేవుడని, ఎందుకు దేవుడు నాపై ప్రేమ చూపడం లేదనే కోపం ఒక వైపు, డాక్టర్ కావలెనే కోరిక తీరకపోవడం మరో వైపు రోహిత్ ను ఎంతగానో కుంగదీసాయి.
   దక్షణాది ప్రజల కొంగు బంగారంగా విలసిల్లుతున్న వేములవాడ దేవుడి సన్నిధిలో తను మరణించే ముందు ఒక లేఖ రాసాడు అందులో నాకు మరో జన్మ వద్దని,దేవుళ్ళని ప్రార్థిస్తూ లేఖ మొదలెట్టిన రోహిత్ తను రాసుకున్న సూసైడ్ నోట్ ఒక మంచి సందేశం గా భావించాలని ,మరణం కంటే జీవించడమే ఏంతో ఇబ్బంది అని చెప్పుతూ తను చనిపోయారు.
   అంతే కాకుండా తన జీవితాన్ని జగన్మాతకు అర్పిస్తున్నానని, నా మృతదేహం కాశిలో దహనం చేయాలని లేఖను ముగించాడు.
   దేవుళ్ళంటే విశ్వాసం ఉండాలి కానీ ఇంత విశ్వాసం పనికిరాదనే వాస్తవం తెలియకుండానే అనేక మంది యువతీ యువకులు జీవితాలను నాశనం చేసుకొంటున్నారు.
   అన్ని మతాల్లో దేవుడి రక్షణ కోసం పరితపించే వారు వాస్తవాలను ఎందుకు పట్టించుకోవడం లేదో చర్చ జరగాలి.
   రోజు దేవుడికి మొక్కి అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాలని కోరుకునే భక్తులు వాళ్ల వ్యక్తిగత జీవితంలో వెనుక బడటానికి దేవుడు కారణమని భావించినప్పుడు ఎవరిని నిందించాలి...? దేవున్నా...? లేక మనిషినా...?
   కులం పేర ,దేవుడి పేరు మీద, సంస్కృతి, పేరుమీద హింస జరుగుతుంటే ఎందుకు దేవుడాపడో....? ఎవరు చెప్పాలి...!
   కర్మ సిద్ధాంతం చెప్పి గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించాలనే సమాజం రోజు పసి పిల్లలను చేరబట్టి చంపి వేస్తుంటే దేవుడేం చేస్తున్నట్టో....?
   ప్రజలు, మేధావులు ఆలోచన చేయాలి.
   సమాజంలో జరుగుతున్న అనేక రకాల సమస్యలకు సంస్కృతి,సాంప్రదాయాలు, కులం,మతం,దేవుడు, ఇలా అనేక అమానవీవియ సంఘటనలకు ఎవరు, కారణమో...?
చర్చ చేయండి....!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments