Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

చదువుకొన్న వారికి ఉద్యోగం, ఉపాధి, లేదు.

   ఈదేశంలో ఎలా బ్రతకాలో తెలియని స్థితిలో యువత ఉంది.
   ఒక చోట కులం తక్కువ,ఎక్కువ అనే సామాజిక సమస్యతో ప్రజలు సతమతమౌతున్నారు,కొన్ని చోట్ల ప్రేమిస్తే కులం,మతం పేర హత్యలు చేసారు,చేస్తున్నారు.
   రాజ్యాంగంలో ఇచ్చిన కనీస హక్కులు అనగా భూమి హక్కు,వాక్ స్వతంత్రపు హక్కు,అందరూ సమానమని, ప్రజలందరికీ సమాన న్యాయం జరగాలని రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పనిచేయాలని ప్రశ్నిస్తే వారిని తీవ్రవాదులని, తిరుగుబాటు దారులని, ముద్ర వేసి చంపి వేస్తున్నారు.
   నగర జీవితానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో జీవిస్తున్న ఆదివాసులను మావోయిస్టుల పేరిట కాల్చి చంపుతున్నారు. దేశంలో ప్రజలకు సమాన న్యాయం, హక్కులు దక్కాలని పోరాటం చేస్తున్నా వారిని దేశ ఆర్మీని రంగంలోకి దింపి మారణ హోమం సృష్టిస్తున్నారు. కనీసం చర్చలు జరిపి వాళ్ల మాటను కూడా వినే ఉద్దేశం లేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఉండటమే కాదు 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని కూకటివేళ్లతో సహా పీకి వేస్తామని ప్రకటించారు.
   దేశంలో బ్యాంకులని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారికి దేశం లోపల,బయట రాచమర్యాదలు అందుతున్నాయి. నేరస్థులని తెలిసిన దేశంలోని కోర్టులు వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
   దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో కమిషన్స్ తేల్చి చెపుతున్నాయి. అయిన ఆర్ధిక నేరస్థులు దర్జాగా ప్రభుత్వ వసతులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
   ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసిన ఏమిచేయలేక పోతున్నారు.
   చదువుకొన్న వారికి ఉద్యోగం, ఉపాధి, లేదు.
   గ్రామాల్లో రాజకీయ నేతల దగ్గర అరాచక వాదులుగా తయారై జీవనం గడుపుతున్నారు. వయస్సు మీద పడిన యువత అటు ముందుకు పోలేక, వెనుకకు రాలేక సంఘర్షణ పడుతున్న యువతను ఎవరు దారిలో పెట్టాలి.ఎంతో భవిష్యత్తు ఉన్న యువతను మత్తులో ఉంచి సోమమరిపోతులను చేస్తున్నారు.
   ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లేసి ఐదేళ్లు బానిసలుగా మారడం ఓటర్ల వంతుగా మారిపోయింది.
   ఆర్టికల్ 340 ద్వారా దేశంలో మెజార్టీ ప్రజలకు పార్లమెంట్ కు వెళ్లడానికి అవకాశం కల్పించాలని 75 సంవత్సరాల నుండి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నా ఫలితం లేదు.
   బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి లోకసభలో బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెడితే నాటి హిందూ మతోన్మాద అగ్రకులాలు అడ్డుకొని రిజర్వేషన్లు రాకుండా చేశాయి.
   బీసీలకు రిజర్వేషన్ల రాకపోవడానికి అంబేడ్కర్ రే కారణమని ఎస్సీ, ఎస్టిలకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు ఇవ్వలేదని అంబేడ్కర్ పై అపవాదు మోపి నేటికి అగ్రవర్ణ పార్టీలు రాజ్యమేలుతున్నారు.
   ఇంకా ఎన్నేళ్లు ఇలా రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు. కనీసం ప్రజలపై మానవత్వం చూపని పార్టీలు, నాయకుల పెత్తనాన్ని ఇంకా ఎంతకాలం భరించాలి.
   రాజ్యాంగం రాసుకొని దానిప్రకరమే నడవాలని చెప్పే ప్రభుత్వ అధికారులు చట్టా ప్రకారం నడుస్తున్నారా...?
   ఒక్కసారి ఆలోచించాలి..!
   దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి ఐతే పేదరికం ఇంకా ఎందుకుంది...?
   ఇప్పటికీ దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
   నాణ్యమైన విద్య, వైద్యం, ఆహారం, ఇంకా అనేక నిత్యావసర వస్తువుల కోసం ఎన్నేళ్లు పోరాటం చేయాలి..?
   రోజు టీవీల్లో, న్యూస్ పేపర్స్ లో హిందూ ముస్లిం గొడవలు వాళ్ళు వీళ్లను, వీళ్లను వాళ్ళు రెచ్చగొట్టుకునే ప్రకటనలు చూపిస్తూ పరిపాలిస్తున్న ప్రభుత్వాలను ప్రజలు ఇంకా ఎంతకాలం భరించాలి.
   పార్లమెంట్ లో ప్రజలకు అవసరమైన విషయాలు చర్చ లేకుండా మతాలపై కులలపై, గొడవలు పెట్టి కాలం గడుపుతున్న నేతలను ప్రశ్నించనంత కాలం దేశం ఇలానే ఉంటుంది.
   మార్చుకోవాల్సింది,మారాల్సింది మనమే ...!
   మిత్రులారా...? మీరేమంటారు...!!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments