Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

బీసీ లెక్కలు సరిగాలేవని అంటున్న బీజేపీ పార్టీ మీరు అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయడం లేదో స్పష్టం చేయాలి.

   ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి కులం ఉంటది కానీ మనమే మనుషులమన్నా విషయాన్ని మరిచిపోయి విమర్శలు,అల్లర్లు,గొడవలు పడుతుంటాం....!
   పాపం చదువులేని వారు గ్రామాల్లో కలిసి మెలిసి వ్యవసాయం చేసుకొంటారు, ఒకరికి ఒక్కరూ సహకరించుకొని ఉమ్మడిగా జీవిస్తూ వుంటారు...!
   దేశంలో ప్రధానమంత్రి కులం గురించి గొడవ మొదలై, ఇప్పుడు బీసీ జనాభా లెక్కల విషయాన్ని పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
   బీసీ లెక్కలు సరిగాలేవని అంటున్న బీజేపీ పార్టీ మీరు అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయడం లేదో స్పష్టం చేయాలి.
   అంతే కాదు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేయకుండా బీసీ, ఓబీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారన్న విషయం సభ్య సమాజం గమనిస్తున్నది.
   మోడీని నెత్తి మీద మోస్తున్న తెలంగాణ బీజేపీ బీసీ నేతల, పరిస్థితి చూస్తే బానిసత్వం వాళ్ళ తలకు ఎంత మోతాదులో ఎక్కిందో చూస్తే అర్థం అవుతుంది.
   చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేక వెనుకబడిన విషయాలను ఆటకెక్కించి మోడీకి భజన చేయడం దిన చర్యగా పెట్టుకొనట్లు వీరి తీరు కనపడుతుంది.
   అంతే కాదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు సాదించుకొన్న అగ్రవర్ణాలను చూసి కూడా వీళ్లకు జ్ఞానం రావడం లేదు.
   బీసీల అవకాశాలు అగ్రవర్ణాలు దొబ్బిపోతున్న వీళ్లకు పట్టదు.
   కానీ వ్యక్తిగత అవకాశాల కోసం సాగిలపడుతూ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని ఎందుకనుకోకూడదో తెలంగాణ బీసీ బీజేపీ నేతలు చెప్పాలి.
   మీకు బీసీలపై ప్రేమ ఉంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల బిల్లు అమలుకు మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును సాదించుకోవాలి. అంతే కాని కులగణన చేస్తున్న వారిని విమర్శల్తో దాడిచేస్తు బీసీలకు ప్రగతి నిరోదకులుగా మారితే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్లి క్షేమించదు.
   తెలంగాణ రాష్ట్రం నుండి జిఎస్టి రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కేంద్ర ప్రభుత్వం అదే రీతిలో తెలంగాణకు అన్యాయం చేస్తున్న, తెలంగాణ బీజేపీ నేతలకు పట్టదు. కానీ తెలంగాణా సమాజాన్ని హిందు మతం పేరిట విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ బీసీ సమాజానికి ఏమి కావాలో వారికి పట్టదు.
   మోడీ కులం మారిందంటున్న బీజేపీ నేతలకు కులం మారదన్న విషయం తెలియక పోవడం విచారకరం.
   మోడీ కులాన్ని అగ్రవర్ణాల నుండి ఓబీసీ కుల జాబితాలోకి మారిస్తే కులం మారిపోతుందా...? తెలంగాణ బీజేపీ నేతలు అర్థం చేసుకోవాలి.
   బీసీల లీడర్లమని చెప్పుకు తిరుగుతున్న బీజేపీ బీసీ నేతలు ఇప్పటికైనా కళ్ళుతెరువవాలి...! లేకపోతే బీసీ సమాజం మిమ్మల్లి క్షేమించదు....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments