Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఆరోగ్య శ్రీ ,పీజురీఎంబర్స్ మెంట్, ఇంకా అనేక పథకాలల్లో పేదల వాటా లేదా..?

   కడుపు నిండిన వారు ఏమైనా ఈదేశంలో మాట్లాడుతారు...!
   ప్రభుత్వవాలు ఉచితాలను ప్రకటించటం వల్ల వ్యవసాయదారులకి కూలీలు దొరకడం లేదని పేదప్రజలకు ఉచితంగా అన్ని లభిస్తే వారు కూలికి ఎందుకు వస్తారు...? అని ఒక న్యాయ మూర్తి అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి...?
   దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాల్లో దేశంలో సుమారు 80 కోట్ల మందికి రేషన్ కార్డ్ ద్వారా ఆహారం అందుతున్నదంటే ఈ దేశ పాలకుల ప్రజరంజక పాలన ఎలా ఉందో ఒకసారి అవగతం చేసుకోవాలి.
   రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని నెత్తినోరు మొత్తుకున్నా, ధర్నాలు, రాస్తారోకో లు,ఆమరణ నిరాహార దీక్షలు చేసినా స్పందించని ప్రభుత్వాలను ఎవరడగాలి...?
   కష్టపడలనే ఆలోచనే పేదలకు లేదట...!మొత్తం ప్రభుత్వం సొమ్ముతో జీవిస్తున్న వీళ్ళను సోమరిపోతులు అంటున్న సుద్ద పుసలు ప్రభుత్వనికి కట్టాల్సిన పన్నులు ఎందుకు ఎగ్గొట్టుతున్నారో ఎవరడగాలి.!
   ప్రతిరోజు నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో జిఎస్టి కడుతున్న పేదలు డబ్బులను వేతనాలుగా పొందుతున్న ఈ భాడాబాబులు దేశం గురించి మాట్లాడుతున్నారు.
   నిత్యం అవినీతి చేయనిదే నిద్రపట్టని ఈ సుద్దపూసలు సామాన్యులకు ఒక్క అన్నం ముద్ద దొరకడం భరించలేక పోతున్నారు.
   ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి పోతే అయ్యే ఖర్చు ఎమన్నా తగ్గించి వైద్యం చేస్తున్నారా...!
   ఆరోగ్య శ్రీ ,పీజురీఎంబర్స్ మెంట్, ఇంకా అనేక పథకాలల్లో పేదల వాటా లేదా..?
   ప్రైవేటు ఆసుపత్రిలో జరుగుతున్న దోపిడీ గురించి ఒక్కరోజైన మాట్లాడినారా గుండె మీద చెయ్యెసుకొని చెప్పండి....?
   పేదలంతా ఆత్మగౌరవం తో బ్రతికేవారే...!మీలగా సమాజాన్ని, మోసం చేయడం రాకనే ఇంకా ఆత్మగౌరవం గల పేదలుగా బ్రతుకుతున్నారు.
   ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఈ సుద్దపూసలు ఎన్నికల్లో డబ్బులు పంచడం వీళ్లకు తప్పుగా అనిపించదు.
   ఓట్లను అమ్ముకుంటున్నారనే దొంగ నేతలు, అధికారులు, మాత్రం కోట్లకొలది డబ్బును యథేచ్ఛగా కొట్టేయవచ్చు. కానీ సామాన్యులకు మాత్రం బుక్కెడు బువ్వ దొరికితే కండ్ల మంట...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments