Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రాజ్యాంగం రాసింది అందరి కోసం ఐనప్పటికీ అది కొందరికి ఉపయోగపడుతుందన్నా మాట మాత్రం వాస్తవం.

  పేదోడు ఒక దనవంతునికిన బాకీపడితే బాకీ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు పోలీస్ సహాయం కోరితే పేద కూలిని పిలిచి బెదిరించి నోటికి ఇష్టమొచ్చిన రీతిలో బూతులు తిట్టి,అవసరమైతే తన్ని భయబ్రాంతులకు గురిచేసి ఆ పేదవాడి భూమిని స్వాధీనం చేసుకొంటున్నారు.
   ఒకవేళ మళ్ళీ ఆకూలి కుటుంబం తిరగబడితే ఎలా...? అని ఆ ఇళ్ళమ్మా రాజులను పిలిపించి అప్పు తీసుకున్నప్పుడు తీర్చాలని తెల్వదా...? డబ్బు కట్టకపోతే ఇలా ఉంటుందన్న హేచ్చరిక చేసి ఆపేద కూలి కుటుంబంతో సాక్షి సంతకాలు పెట్టించ్చికొని ఉన్నభుమిని ధనవంతులకు అప్పగిస్తున్న పరిస్థితులు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ తతంగం మొత్తం పోలీసులు దగ్గరుండి దొర వారికి సహాయం చేస్తున్న పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు...!
   అదే పేదవాడు తను కాయకష్టం చేసి సంపాదించుకొన్నా ఆస్తి కావచ్చు,లేక వారసత్వంగా వచ్చిందైనా కావచ్చు...! ఏదైనా ప్రమాదంలో పడి గాని,లేదా ఒక అధికార ప్రతినిధి కబంధ హస్థల్లో ఇరుక్కుపోయి, సహాయం కోసం పోలీస్ ను ఆశ్రయిస్తే....! అప్పడు ఆ పోలీసుకు చట్టం,నియమ నిబంధనలు గుర్తుకొచ్చి భూముల పంచాయితీలు ఇక్కడ చేయరు...!
   నువ్వు కోర్టుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందే కానీ ఇక్కడ కాదు అని ఇచ్చిన దరఖాస్తు సివిల్ నేచర్ లో క్లోజ్ చేస్తున్నాం అని ఒక మెసేజ్ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు..! ఇది ఎవ్వరు నమ్మిన నమ్మకపోయిన నమ్మాల్సిన పచ్చినిజం.
   అసలు మనిషి ఈ స్వాతంత్ర దేశంలో స్వాతంత్రడు కదా...? ఎందుకు మనుషుల మధ్య ఇంత అంతరం...! ఎవ్వరు ఎందుకు పట్టించుకోరు....! పొద్దున లేస్తే ఎవ్వరి గోళా వాళ్లదే...!
   ఎస్సీల లీడర్లు అధికార,ప్రతిపక్ష పార్టీల దగ్గర కొలువుదీరి ఉంటారు. ఐన ఆ సమస్య మనది కాదన్నా భావనే వారికుంటుంది. ఒకవేళ దాని గురించి పట్టించుకొని బాధితులకు సహాయం అందిస్తే ఆ పార్టీకో... నాయకుడికో... బాండెడ్ కావల్సిన పరిస్థితి...!
   ఓట్ల పండుగ వొస్తే ఎవ్వన్నీ చూసిన లోపలంతా కంపు ఆలోచనే...! బట్టలు మాత్రనే ఖద్దరు కానీ కడుపులో మాత్రం కుట్రలు కుతంత్రాలు...! ఓట్ల కోసం వాడు నమ్ముకున్న నాయకుడి కోసం, రక్త సంబంధీకులను, కూడా మోసం చేసే వరకు ఎస్సీ, ఎస్టీ నేతలకు నిద్రపట్టదు.
   దేశంలో జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు, రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా, మేలుగుతున్న వారు పోలీసు స్టేషన్ నోటీస్ బోర్డులో ఉన్న రౌడీలు, ఆసుపత్రిలో బాధితులు,నిత్యం మద్యం సేవిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న సమాజం కోసం ఈ పాలకులు పనిచేస్తారని నమ్మి నాశనమౌతున్న వారిని ఎవరు కాపాడాలి.
   అంబెడ్కర్ ఇచ్చిన హక్కులు కావాలి, కానీ ఆయన చెప్పిన విషయాలు పట్టించుకోరు. ఇలా ఇంకా ఎన్నియేళ్ళు బానిసత్వంలో ఉంటారో తెలియని పరిస్థితి.
   రాజ్యాంగం రాసింది అందరి కోసం ఐనప్పటికీ అది కొందరికి ఉపయోగపడుతుందన్నా మాట మాత్రం వాస్తవం.
   ఏది ఏమైనా మోసం చేసే పార్టీలను నాయకులను రాజకీయంగా సమాధి చేయకపోతే బహుజన సమాజం అన్ని హక్కులూ కోల్పోయి బానిసత్వంలో వెళ్లడం మాత్రం ఖాయం...!
   మిత్రులారా...! మీరేమంటారు....?
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments