Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

విచారణ కోసం దర్యాప్తు సంస్థలు పిలిస్తే ఎందుకు కోర్టు కెల్లారు..?

   తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య రోజు పత్రికల్లో టీవీల్లో పార్ములా ఈ-రేస్ గురించి వింటున్నాం. అసలు పార్ములా ఈ - రేస్ అంటే ఏమిటి...? ఇది ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారు...! అంటే అర్ధం కాని సమస్య.
   తెలంగాణ ఏర్పడ్డది ఎందుకోసం...?
   నిధులు,నియామకాలు,లేక రైతులు,విద్యార్థులు,యావత్తు తెలంగాణ సమాజం దోపిడీకి గురైపోతున్న సమయంలో తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకొంటే వ్యాపారుల కోసం, దోపిడీ దారుల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కర్చుపెట్టామని యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేసే పనిలో గత ప్రభుత్వం ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
   ఒక వైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక,విద్యార్థులకు ఉద్యోగాలు లేక, మధ్యతరగతి ప్రజలకు సరైన అభివృద్ధి ఫలాలు లేక తెచుకొన్న తెలంగాణ అప్పుల కుప్పలై మునిగి నాశనం అవుతుంటే పార్ములా ఈ - రేస్ ఆటలు కావాలట...? అడిగే టోడు లేడని దొరతనంతో విర్రవీగడం కాకపోతే ఏమిటి ఇదంతా...?
   నియమాలను పాటించకుండా నిధుల విడుదల జరిగిందని స్వయంగా ఆ శాఖ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా...?
   ఇంకా ఏమికావాలి, అంతేకాదు మీరు చెల్లించిన చెల్లింపులు రిజర్వు బ్యాంకు నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయని 8 కోట్ల ఫైన్ కూడా వేసింది కదా...? దినికి ఏమి సమదానం చెప్పుతారు.
   మీరు నిజాయితీ పరులే అనుకొందాం...!
   విచారణ కోసం దర్యాప్తు సంస్థలు పిలిస్తే ఎందుకు కోర్టు కెల్లారు..?
   విచారణ ఎదుక్కొని కడిగిన ముత్యంలా బయటకు రావచ్చు కదా...?
   మరెందుకు హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు...?
   ఇదంతా తెలంగాణ పౌర సమాజం చూస్తుంది కదా...!
   రాజకీయాలు అన్నప్పడు కక్షసాధింపు చర్యలు, విచారణలు ఉంటాయి కదా...! వాటిని ఎదుర్కోవాలి కానీ ప్రజలు పట్టం కట్టిన ముఖ్యమంత్రిని లొట్టపిసు ముఖ్యమంత్రి అంటారా...? దాన్ని ఏవిధంగా సమాజం అర్థం చేసికోవాలి.
   ఆలెక్కన మీ తండ్రి కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు మరి ఆయన కూడా లొట్టపీసు ముఖ్యమంత్రేనా...?
   ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తే ప్రజలు హర్షిస్త్తారు.
   కానీ ఇలాంటి ప్రజామోదం లేని పనులు చేసి కోర్టుల నుండి తప్పించుకుంటారేమో కానీ ప్రజలు మిమ్మల్లి గమనిస్తారన్న విషయం మరిచిపోతే అది ఆహాకారమే అవుతుంది...!
తెలంగాణ ప్రజలారా...!మీరేమంటారు...?
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments