Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్ల రేసింగ్ సంస్థ తో ఒప్పందం రద్దు జరిగి నష్టం వాటిల్లిందని కేటీఆర్ అంటున్నారు.

  తెలంగాణ లో జరుగుతున్న చర్చలను పౌరసమాజం ఒక్కసారి ఆలోచించండి....!
   ఏ టీవీ చూసినా, ఈపేపర్ చూసిన పార్ములా-ఈ రేసు గురించే వార్తలు కనపడుతున్నాయి.
   అసలు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైన విషయమేనా...? అంటే తెలంగాణ విద్యార్థులకు ఉపాధి ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం గురించి చర్చలు చూస్తుంటే ఇందుకేనా తెలంగాణా తెచుకొన్నది అనిపిస్తుంది....!
   ప్రభుత్వ సొమ్ము తెలంగాణా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచడం కోసం పార్ములా-ఈ రేసు కోసం బాజాప్త 55 కోట్ల రూపాయలు చెల్లించాము అని కేటీఆర్ బహిరంగంగాచెపుతున్నాడు..!
   ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్ల రేసింగ్ సంస్థ తో ఒప్పందం రద్దు జరిగి నష్టం వాటిల్లిందని కేటీఆర్ అంటున్నారు.
   మరి రద్దు ఐతే డబ్బు తిరిగి రాకపోగా నియమ నిబంధనలు పాటించక 55 కోట్ల రూపాయలను చెల్లించడం వల్ల రిజర్వు బ్యాంకు మరో 8 కోట్ల రూపాయల జరిమాన వేసిందట. ఆ ఎనిమిది కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కారు చెల్లింపులు చేశారట...!
   రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొన్న నిర్ణయం వల్లదేశం,రాష్టం పరువు పోయిందని కాబట్టి రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.
   పైగా తామే మళ్ళీ అధికారంలోకి వస్తామన్నా ధీమా తో డబ్బులు చెల్లించమని కేటీఆర్ అంటున్నాడంటే కేసీఆర్ ఏలికలో ఎన్ని అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
   నీళ్లు నిధులు, నియామకాలు గురించి చర్చ చూసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు రూపాయలు కర్చుపెడితే ఒక్క ఎకరం నీళ్లు పారడం పక్కకు పేట్టితే ప్రాజెక్టు లో అవినీతి ఆరోపణలు జరిగాయని, అందుకే ప్రాజెక్టు పిల్లరు క్రుంగయాని విచారం కమిటీ తేల్చింది,
   ఈ విషయంలో అప్పుడు విధులు, నిధులు విడుదల చేసిన ఐఏఎస్ లు నీటిపారుదల చీప్ ఇంజనీరింగ్ అధికారులు మాకేం తెల్వదని చేతులు ఎత్తివేస్తుంటే అసలు ఎందుకు తెలంగాణ తెచ్చుకోన్నామురా అనే సందేహం కలుగుతోంది.... ఇంత ఘోరమా...?
   జవాబు దారి తనమంటే ఇదేనా...?
   ఒకవైపు బిడ్డ లిక్కర్ కుంభకోణం, మరో వైపు కొడుకు పార్ములా రేస్ కుంభకోణం, ఇక కేసీఆర్ ఐతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టిన పాపాన పోలేదు.
   రాష్ట్రంలో ఎన్ని సమస్యల తో సతమతమవుతున్నా ఒక ప్రతిపక్ష నాయకునికి పట్టదు. పైగా నేనె తెలంగాణ గాంధీ ని అని ఒక పోజు...!
   తెలంగాణా లో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సంపద పెరిగిందని చెపుతున్న కేటీఆర్ ఎవరి సంపద పెరిగిందో చెప్పాలి.
   కేటీఆర్ చెప్పినట్లు పార్ములా- ఈ రేస్ వల్ల 700 కోట్ల లాభం వస్తే 8 కోట్ల రూపాయల పైన్ రిజర్వు బ్యాంకు ఎందుకేసిందో కేటీఆర్ చెప్పాలి....!
   మిత్రులారా..!మీరేమంటారు.!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments