Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

దేశ సంపద ఆదాని, అంబానీ కలిసి దోపిడి చేస్తున్నాయని ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా పార్లమెంట్ లో ఎంత మొత్తుకున్నా పలితం లేదు.

   దేశంలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి వెన్ను దన్నుగా ఉండి, ప్రజాస్వామ్య వ్యవస్థ వెన్నువిరుస్తున్న పాసిస్టు లకు వంతపాడుతున్న అంబానీ, ఆదానీ లపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారణ చేపట్టి దేశాన్ని కాపాడాలని ఎన్నిసార్లు పార్లమెంట్ వేదికగా మొత్తుకున్నా మోడీ ప్రభుత్వానికి చలనం లేదు.కానీ ఆదానిపై అమెరికా ప్రభుత్వం కేసులు పెట్టగానే భారత దర్యాప్తు సంస్థలు అవమానంతో నిర్వేదం లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అమెరికా దేశం ఆధాని అవినీతిని బయట పెట్టె సరికి సమాజానికి ఎలా జవాబు చెప్పాలో తెలియక ఆ అవినీతి జరిగిన సమయంలో మాపార్టీ అధికారంలో లేదని తప్పించుకునే పనిలో బీజేపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు.
   గతంలో హిడెన్ బర్గ్ నివేదిక ఆదాని అవకతవకలు లపై 2023లోనే ఒక నివేదిక బయట పెట్టిన సంగతి ప్రజలకు, రాజకీయ పార్టీల నేతలకు తెలిసిన విషయమే.
   హిడెన్ బర్గ్ నివేదిక 2023జనవరిలో స్టాక్ మార్కెట్ లావాదేవీలను ఆదాని తారుమారు చేశారని ప్రకటించి సంచలనం సృష్టించింది.
   దేశంలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల కోసం ఆదాని సంస్థ వివిధ రాష్ట్రాప్రభుత్వాలకు 2029కోట్ల రూపాయలు లంచాలను ఇచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థ ప్రకటించి కేసుకుడా పెట్టింది.
   కానీ అమెరికా ఎఫ్ బి ఐ చెప్పేవాన్ని అబద్దాలని డొల్లమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు ఆదాని గ్రూపు మొదలుపెట్టింది.
   పైగా చట్టాలకు లోబడి నడుచుకొంటామని ప్రజలను, ఖాతాదారులను నమ్మించే ప్రయత్నం చేస్తోంది ఆదాని గ్రూప్.
   ఎలక్షన్ బాండ్ల స్కిం లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సుమారు 6000 కోట్ల రూపాయలు బండ్లను బహుమతి ఇచ్చినట్లు స్వయంగా సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం ఇంకా ప్రజలు మరిచిపోలేదు.
   ఎలక్షన్ బండ్ల పొందడం కోసం బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి రాజకీయ పార్టీల కు దొడ్డిదారిన డబ్బులు అందే మార్గన్ని సుగమం చేసింది. ఈ తతంగమంతా ఆదాని, అంబానీ సంస్థల ఎదుగుదల కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన ఘనత.
   దేశ సంపద ఆదాని, అంబానీ కలిసి దోపిడి చేస్తున్నాయని ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా పార్లమెంట్ లో ఎంత మొత్తుకున్నా పలితం లేదు.
   ఇప్పడు స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి 1750 కోట్ల ముడుపులు ముట్టాయని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సైoజ్ కమిషన్ నిగ్గుతేల్చింది.
   దీనిపై మోడీ ఇంకా నోరుతెరువలేదు. చిక్కంతా ఇక్కడే మొదలయ్యింది.
   భారత సౌర విద్యుత్ సంస్థ( సెకీ)ను అడ్డం పెట్టుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు ఆదాని గ్రూప్ దక్కించుకోవటం కోసం 2021 నుండి 2024 మధ్య కాలంలో లంచాలు ఇచ్చినట్లు అమెరికా నిఘా సంస్థలు పసిగట్టి బయటపెట్టాయి.
   ఈ విషయాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనేక సార్లు పార్లమెంట్ వేదికగా పోరాటం చేసిన ఆదాని, అంబాని కి చిన్న కష్టం కూడా రాకుండానరేంద్రమోదీ ఆదుకున్న చరిత్ర సమాజానికి కనపడింది
   మనీలాండరింగ్ కేసుల్లో ముఖ్యమంత్రులను జైల్ కి పంపిన మన భారతీయ దర్యాప్తు సంస్థలు మోడీని కాదని ఆదానీ ఆస్తులపై విచారణ జరిపి ఆదానీ నుండి లంచాలు పొందిన పార్టీలపై వివిధ పార్టీల నేతలపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం దర్యాప్తు సంస్థ లకు ఉందా....? అంటే కష్ట మనే గత చరిత్ర చెప్పుతుంది.
   మరి మీరేమంటారు...?
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments