Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

నేడు కేటీఆర్ కామెట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి...!

నేడు కేటీఆర్ కామెట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి...!
   గత ప్రభుత్వంలో అన్ని తానై నడిచిన కేటీఆర్ నేడు తను రోజు ఇస్తున్న స్టేట్స్మెంట్స్, కామెంట్స్ చూస్తే చట్టం అంటే గౌరవం పూర్తిగా లేనట్లు అనిపిస్తుంది.
   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రెచ్చగొడుతూ మీ ఏసిబి లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడు పంపిన పర్వాలేదు నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు.మరి ఎందుకు అంత తొందర కేటీఆర్.
   కేటీఆర్ పై పార్ములా రేస్,రేవ్ పార్టీ , డ్రగ్స్ కేసులు, ఇలా అనేక కేసుల్లో సంబంధం ఉన్నదని విచారణ సంస్థలు గతంలో ఆరోపించాయి. గంతెందుకు స్వయంగా కేటీఆర్ నేనే పార్ములా రేస్ కోసం 55 లక్షల రూపాయలు రిలీజ్ చేసాను అని బహిరంగానే మాట్లాడుతున్నారు మరి దీన్ని తెలంగాణ సమాజం ఎలా అర్థం చేసుకోవాలి.
   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడవక ముందే ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న కేటీఆర్ అనేక ఆరోపణలు ప్రభుత్వం పై చేస్తున్నారు. నిజమైతే విచారణ కోరండి. మీరు కూడా గతంలో మీపైన ఆరోపించబడ్డ కేసుల్లో విచారణ సంస్థలకు సహకారం అందించండి అంతేకాని పొద్దున లేస్తే ప్రభుత్వం పై ఆరోపణలు చేయడంలో పసలేమి తనం కనపడుతుంది. అంతే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ సంస్థల ఒప్పందాలు, ధరణి ఇంకా ఎన్నోన్నో విషయాలపై విచారణ చేపట్టిన ప్రభుత్వ అధికారులపై, ప్రభుత్వం పై మీ వైఖరి సరిగా లేదని అర్థమౌతుంది. అంతేకాదు పోన్ ట్యాపింగ్ వ్యవహారం లో కొంతమంది ఉన్నతాధికారులు ఎందుకు జైలుకెళ్లారో చెప్పుతారా...?
   దానిపై ఎందుకు ప్రజల్లోకి రారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంజనీర్లు ఇస్తున్న స్టేట్స్మెంట్స్ మీరు చూస్తాలేరా...? వీటిపై ఎందుకు స్పందించడం లేదు. మీ ఏలుబడిలో కలెక్టర్లు గా పనిచేసిన కొంతమంది ఐ ఏ ఎస్ లపై ED కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంది దాని పై ఎందుకు మీరు స్పందించరు.
   అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో వందలాది ఎకరాల భూమిపై దర్యాప్తు జరుగుతుంది ఎందుకో మీరు బాగా ప్రేమీంచే తెలంగాణ ప్రజలకు వివారిస్తారా....!
   ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆరోపణలు మీపై ప్రజలముందు ఉన్నాయి. వీటి పైన చర్చ కోసం ప్రజల మధ్యకు రండి ఈ విషయాలపై చర్చ చేయండి అంతేకానీ కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని నిత్యం విమర్శలు చేస్తూ వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా మీ వ్యవరశైలి ఉన్నట్లు తెలంగాణ సమాజం అనుకొంటున్నది.
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments