Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ముచ్చటగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారంటే మీ సహకారం లేదనుకోవాలా....?

మోడీ అవినీతి పరులను వదిలి పెట్టడట....!
----------------------------------------
   ఈ స్టేట్మెంట్ చూడగానే ఏదో వింతగా అనిపించడం సహజం కాని నిజమేనట...!
   ఏమిటా నిజం...!
   గుజరాత్ రాష్ట్రానికే దేశ సంపదను తకట్టుపెట్టాన్ని వారసత్వం గా కొనసాగిస్తూనే ఉన్నారని చరిత్ర చెప్పుతుంది.
   విజయ్ మాల్యా, మేగల్ చోక్స్, నీరవ్ మోడీ, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర నిఘా సంస్థలు దోషులని తేల్చిన సుమారు 28 మంది దేశ సంపద ను పది లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేసిన వారిని దేశం దాటించిన ఘనత ఈదేశ ప్రధాని మోడీ ది కాదా...?
   మళ్ళీ తానే ఈదేశంలో అవినితిని, అవినీతి పరులను వదలడట...! చిత్రంగా ఉంది కదా....!
   అంతే కాకుండా దేశంలో పేదరికంతో మగ్గుతున్నా సుమారు రెండు కోట్ల మందిని ఎంపిక చేసి జీరో అకౌంట్లు తీసి ఒక్కొక్క అకౌంటుకు 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి దేశాన్ని10 సంవత్సరాలు పాలించారు.
   కానీ ఎక్కడున్నా పేదరికం అక్కడే ఉంది, మళ్ళీ అధికారం ఇస్తే అవినీతి పరులను బయటకు తీసి ఉరేస్తాడటా....!
   కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2G కుంభకోణం, జరిగిందని పదేపదే చెపుతున్న బీజేపీ నేతలు మోడీ ప్రధానిగా ఉండి శిక్షలు పడే విందంగా ఎందుకు ప్రయత్నం చేయలేదో మాత్రం చెప్పరు...!
   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు జరిగిన కుంభకోణాల పై చర్యలు తీసుకోలేని మోడీ, ఆయన ప్రభుత్వం ప్రజలకు పాత విషయాలే చెప్పి విసిగించటం తప్ప మరోటి కాదు.
   దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటిని నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు,వ్యక్తులకు అప్పగించటమే మోడీ చేసిన అభివృద్ధి అని దేశ ప్రజలు అర్థం చేసుకోక తప్పదు.
   దేశంలోని కార్పొరేట్ సంస్థల నుండి చందాలు, ముడుపులు, తీసుకోవడానికి ఏకంగా మోడీ తన క్యాబినెట్ తో చట్టసవరణ చేసి దోపిడీకి పాల్పడి నారంటే మోడీ ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో అర్థం చేసికోవాలి.
   అంతే కాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్నా భారత దేశంలో యువత కోసం మోడీ చేసిందేమైన ఉందంటే మతం మాటున చర్చలు, నిత్యం రాజకీయాల గురించి గొడవలు, రామాలయం, 370 రద్దు ,కోవిడ్, ప్రాంతీయ పార్టీలను అస్థిరపర్చడం ఇంకా ఎన్నో.. ఎన్నోన్నో...! మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి.
   అంతేకాని యువత గురించి పట్టించుకొన్న దాఖలాలు లేవు.
   దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా నేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈడి, సీబీఐ, తదితర నిఘా సంస్థలు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి పాలన చేస్తున్న వారితో చేతులు కలుపుతున్న మోడీ పార్టీని ప్రజలు మళ్ళీ గెలిపించాలాట.?
   తెలంగాణ రాష్ట్రాన్ని నలుదిక్కుల ఉక్కిరిబిక్కిరి చేసి సుమారు పదేళ్లు పాలన చేసిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పలు సందర్భాల్లో స్టేట్మెంట్ చేసిన కేసీఆర్ పై కనీసం కేసు కుడా పెట్టలేదు కానీ అవినీతికి పాల్పడ్డ వారిని ఒదిలిపెట్టడట...!
   అంతే కాదు మీ ఎలుబడిలో ఉన్న మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరల్లో ముద్దాయిగా సుమారు 15నెలలు జైలు జీవితం గడిపింది మోడీ గారికి తెల్వదా...?
   ముచ్చటగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారంటే మీ సహకారం లేదనుకోవాలా....?
   ఏందోయేమో కానీ ఆంద్రప్రదేశ్ లో మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి ని చంపిన వారు నేటికి ట్రెస్ ఔట్ కాలేదు...!ఎందుకో...? మీకు కూడా తెల్వదంటే నమ్మమంటారా...!
   సుమారు మూడు సంవత్సరాలుగా లిక్కర్ కేసులో దోషి అని ఒక్కసారి, సాక్షి అని ఒక్కసారి అద్భుతమైన సీరియల్ స్టోరీ నడిపి మీకు అక్కరకు రాదని గ్రహించి కల్వకుంట్ల కవిత ను అరెస్టు చేసిన విషయం గూడ మీకు తెల్వదని మీ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అంటున్నారు. నిజమేనా...?
   అవినీతి పరులను ,పార్టీలను ఓదలబోనని,వారి భారతం పట్టి ప్రజాధనం కక్కిస్తాని ప్రకటనలు గుప్పిస్తున్న మోడీ ని నమ్మొచ్చో లేదో ప్రజలు తేల్చుకోవాలి
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments