Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కాంగ్రెస్ కొత్త ఒప్పందాలు జరుపనే లేదు. మరి తెలంగాణ ఎందుకు చీకటి అవుతున్నది

   తెలంగాణ ప్రభుత్వం, బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి మారి ముచ్చటగా మూడు నెల్లు గడవనే లేదు....!
   ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు పరుస్తారని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు నీళ్లు అందడం లేదని, కరెంట్ ఇవ్వడం లేదని రైతుకు గిట్టుబాటు ధర, రైతుబందు దళిత బంధు తదితర పథకాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని రాస్తారోకో లు, ఆందోళనలు,పత్రికా ప్రకటనలు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వవాన్ని ఇబ్బంది పెట్టే పనిలో బి ఆర్ ఎస్ నేతలు తల మునకలు అవుతున్నారు. మరి బి ఆర్ ఎస్ నేతృత్వలో జరిగిన ఒప్పందాల మేరకే విద్యుత్ సంస్థలు కరెంట్ ను సప్లై చేస్తున్నారు మరి కరెంట్ ఎందుకు రావడం లేదో ఎవ్వరు చెప్పాలి. అంతే కాదు రైతుల పంటలు చేతికి రానే లేదు గి ట్టు బాటు దరల గురించి అల్లరెందుకో....?
   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అది కూడా ముడునెలల్లోనే ఎందుకు చీకటైతది....?
   కేసీఆర్ అధికారంలో ఉంటే కరెంటు 24 గంటలు ఉంటది అధికారంలో లేకపోతే ఉండదా......!
   రెప్పపాటు కరెంటు పోకుండా కరెంటు ఇచ్చామని బిఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నది..ఇప్పుడెందుకు తెలంగాణ చికటైతదన్నదే అసలైన ప్రశ్నా...?
   కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండగానే విద్యుత్ సంస్థలతో జరిగిన ఒప్పందాల గడువు తీరని లేదు, ఇంకా కాంగ్రెస్ కొత్త ఒప్పందాలు జరుపనే లేదు.
   మరి తెలంగాణ ఎందుకు చీకటి అవుతున్నది. కేసీఆర్ నేతృత్వంలో జరిగిన విద్యుత్ సంస్థలతో జరిగిన ఒప్పందాలపై జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ని కోరిన సంగతి ప్రజలకు తెలియనిది కాదు ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పై పగపట్టినట్లు ఆరోపణ ల యుద్ధం చేస్తున్నారంటే బి ఆర్ ఎస్ పార్టీ ఉద్దేశ్యం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి...!
   విచిత్రమైన విషయం ఏమిటి అంటే పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం కూలిపోతుందా...? ఇదేంప్రశ్న...?
   పిల్లర్లు నాణ్యమైన వైతేనే కదా ప్రాజెక్టు నాల్గుకాలాలు ఉండేది మరి అలాంటిది ఒకటిరెండు పిల్లర్లు కూలితే గింత లోళ్ళా అని గొంతుచించుకొంటున్న కేసీఆర్ ఏమైనా ఇంజనీరా...!లేక సైంటిస్టా...? ప్రపంచంలోనే ఎంతో గొప్ప ప్రాజెక్టు గా కీర్తి ఘడించిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 85శాతం బడ్జెట్ పెట్టి కడితే ఇప్పటికి ఎన్ని ఎకరాలకు నీళ్లు అందాయో నేతలు చేప్పగల్గుతారా....!
   2024 జనవరి నుండి కాళేశ్వరం అప్పుకు మిత్తి కట్టడం ప్రారంభం ఐనది.
   నెలకు 1300 వేల కోట్ల రూపాయల తో పాటు మరమ్మతులు, కరెంట్ బిల్లులు ఇంకా అనేక రకాల ఖర్చులతో కాళేశ్వరం ప్రాజెక్టు తల్లడిల్లుతున్నది.
   తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలని, దానికోసం కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని, ప్రకటించిన కేసీఆర్ ఆతర్వాత తెలంగాణ రాష్టాన్ని ఏమిచేశాడో తెలంగాణ ప్రజలు గమించారని అంతేకాదు. తన కులాన్ని మొత్తం అధికారంలో ఉంచి ఏవిందంగా దోపిడీ చేశారో కూడా తెలంగాణ సమాజం చూసింది.ఆఖరికి యాదవ సామాజిక వర్గం తో గొర్రెపిల్లల కోసం కొన్ని కోట్ల రూపాయలు డిడి లు కట్టించి, అ సమాజక వర్గం ఎదురు తిరిగితే గాని వారి డబ్బులు వారికి అందలేదు అంతేకాదు గొర్రెల పెడరేషన్ పేరిట జరిగిన దోపిడిపై విచారణ కు ఆదేశించిన తరుణంలో హెల్ప్ డిస్క్ లను దొంగిలించిన చరిత్ర మనకు కళ్ళముందు కనపడింది. అంతేకాదు కొంతమంది అధికారులపై క్రిమినల్ కేసులు కూడా జరిగాయంటే ఏమనుకోవాలి...?
   అంతేకాదు కేసీఆర్ సర్కారు లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు, కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుమారు 57 శాఖల చైర్మైన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు రాజీనామా చేశారంటే ఎందుకో ఒక్కసారి ఆలోచించండి. కాగా కొంతమంది ప్రధానంగా విద్యుత్, నీటిపారుదల శాఖ సంక్షేమ శాఖ తాలూకు అధికారుల రాజీనామా లను ఆమోదించకూడదని రాష్ట్రగవర్నర్ కు ముఖ్యమంత్రి లేఖ రాసారంటే ఆయా శాఖల పనితీరు ఎంత ఘోరంగా ఉందొ ఇట్టే అర్థమౌతుంది. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ, కరీంనగర్ సభలకు మాత్రం ఉషారుగా వెళ్లి ప్రసగించటం మాత్రం రాజకీయమే....!కాదంటారా...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments