Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కొన్ని కోట్ల హృదయాల్లో జ్ఞానం నింపిన మనిషి కోసం

   కొన్ని కోట్ల హృదయాల్లో జ్ఞానం నింపిన మనిషి కోసం
   నీ కన్న పిల్లలంతా మరణించిన ఈ దేశ ప్రజలందరికీ అమ్మగా మారిన తల్లి రమాబాయి. ఏం చేద్దామమ్మా...!
   నువ్వు నీ పిల్లలను చంపుకొని మమ్మల్ని మనుషులుగా మార్చితే మేము మాత్రం ముగ్గురమ్మల ములపుటమ్మల సేవలో తల్లడిస్తున్నాం తల్లీ...!
   ప్రతి రోజు పని చేసి పస్తులుండే మాకు గంజి బువ్వపెట్టిన మీకు నిత్యం ఆవేదన, దుక్కన్నే కల్గిస్తున్నావమ్మా.....!
   ఇంకా మేము అజ్ఞాన అంధకారంలో మగ్గిపోతున్నా మెందుకో తెలుసా తల్లి....! మిమ్ము మరిచిన మాకు ప్రస్తుతం కడుపు నిండా బువ్వ దొరికినా ఆత్మగౌరం లేదు తల్లి...! అయ్యా బాంచెన్ అన్నా బ్రతుకులే మిగిలాయి తల్లి
   ఈ సమస్యలకు మీరిచ్చిన స్పూర్తిని పొందకపోవడమే కారణం తల్లీ…!
   పిడికలు చేసి వచ్చిన డబ్బులు సమాజ గమనాన్ని మార్చే, జన చైతన్యకుడు అంబెడ్కర్ కు పంపిన మీకు నేల పైన మా అడుగులున్నంతా సేపు బాకీపడి ఉన్నామమ్మా...!
   బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులను అనుభవించడం చేతకాని చవటలం ఎందుకైతున్నామో....ఇంకా మాకెప్పుడు అర్థమైపోతాదో తల్లీ...!
   నవమాసాలు మోసి నీ కన్నబిడ్డలను మా కోసం త్యాగం చేసిన మీకు ఏమివ్వగలము తల్లీ...!
   ఇంకా బానిసత్వంలోనే ఎందుకున్నామో అర్థం కావడం లేదు తల్లి....!
   గౌరవం లేని మా బ్రతుకులకు సమాజంలో గౌరమిచ్చిన మీ స్ఫూర్తి మా తల్లి దండ్రుల్లో కొరవడింది తల్లి...! మా అమ్మా, అక్కా, చెల్లెల మనసుల్లో జ్ఞానోదయం ఎలా తేవాలో తెలియని అయోమయా స్థితిలో మా మహిళా లోకముంది తల్లి....!
   మా బ్రతుకులను మార్చడం కోసం మీ బ్రతుకుని పూర్తిగా ద్వంసంచేసుకుని మీరు చీకట్లో బ్రతుకుతూ మా జీవితాల్లో వెలుగులు నింపాలని చూశారు..!
   మీరు త్యాగం చేసి అందించిన ఓటు హక్కుని మేము తాయిలాలకు, తాగుడు కి అమ్ముకుంటున్నాము తల్లీ ఎన్ని సంవత్సరాలు మాకోసం మీరు మీ జీవితాల్ని త్యాగం చేసి వెళ్లినా మేము మాత్రం నీకోసం కనీసం పది నిమిషాల సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నందకు మమ్మల్ని క్షమించు తల్లీ..!
   త్యాగానికి ప్రతిరూపంగా ఉన్న మీ జీవితం మొత్తం‌ సమాజానికి అందిస్తే కనీసం మిమ్మల్ని తలచుకోలేని‌ మా చేతగాని తనాన్ని మన్నించు తల్లీ
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments