Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మందిర్ ,370 తీర్పులను ప్రచారం చేస్తున్నా బీజేపీ ఎలాక్టోరల్ బాండ్స్ ఎందుకు ప్రచారం చేయటం లేదు....!

   దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల మూడు ముఖ్యమైన కేసుల్లో తీర్పు చెప్పింది.
   ఒకటి అయోధ్య రామాలయం కేసు, మరోటి 370 ఆర్టికల్ కేసు, కాగా ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్స్ కేసు ముఖ్యమైనవి.
   కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రామాలయం కేసును, 370 ఆర్టికల్ కేసులను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ది పొందే విధంగా పావులు కదుపుతోంది....!
   కానీ అదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరో ముఖ్యమైన కేసు గురించి మాత్రం ఒక్క మాటకాదుకదా... దాని ఉచ్ఛరణే లేదు.
   దేశమంతా బీజేపీ శ్రేణులు ఇంటి, ఇంటికి తిరిగి పసుపు, బియ్యం కలెక్ట్ చేసి అయోధ్యలోని రామునికి పంపి తరించారు.
   మరి అవినీతికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఎలక్టోరల్ బాండ్స్ స్కీం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు ప్రజలలోకి తీసుకెళ్లడం లేదన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం....!
   2017 - 2018 సంవత్సరంలో పార్లమెంట్ చట్టాన్ని సవరించి బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
   ఈ చట్టం తెస్తున్నప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్, ఆర్బీఐ సుముఖత వ్యక్తం చేయకపోయినా వాటిని పక్కకు పెట్టి ఈ బిల్లుని తెచ్చారు.
   రాజ్యసభకు సంబంధం లేకుండా తెచ్చిన ఈబిల్లు చెల్లదని కాంగ్రెస్, సీపీఎం పార్టీలు సుప్రీంకోర్టులో కేసులు వేశారు.
   కాగా 2017 సంవత్సరం నుండి 2023 మార్చి వరకు ఎలక్టొరల్ బాండ్స్ ద్వారా బీజేపీ పార్టీకి 6656, వేల కోట్ల రూపాయలు వచ్చాయి.
   చందాల ద్వారా మరో 4583 కోట్ల రూపాయలు వచ్చాయి.
   ప్రస్తుతం బీజేపీ ఆస్తుల విలువ 1144 కోట్ల రూపాయల విలువ ఉంది. మరి ఈ డబ్బులు ఎవరిచ్చారనేదే ఇక్కడ ప్రశ్న....!
   బీజేపీ పార్టీతో పాటు తమతమ అభ్యర్థులు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎన్నికల సమయంలో సమర్పించిన ఆఫిడవిట్లో ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టులో సమర్పించారు.
   మరి ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనేది తెలియకుండా చేసిన చట్టమే ఎలక్టోరల్ బాండ్స్ స్కీం యొక్క ముఖ్య ఉదేశ్యం..!
   అదే విధముగా దేశంలో బీజేపీ కూటమిలో ఉన్న అధికార పార్టీలకు కూడా పెద్దయెత్తున ఎలక్టోరల్ బాండ్స్ పేరిట డబ్బులు అందినట్లు సమాచారం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పొందుపరిచారు.
   మరి ప్రతిపక్ష పార్టీలకు తృణమో, పలమో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మేమెందుకు పార్టీ ఫండ్ ఇవ్వాలని నిరాకరణ చేసిన కంపెనీల మీదా సంస్థల మీద కేంద్ర నిఘా సంస్థలతో దాడులు చేసి దారికి తెచ్చుకోవటమే వీరి ఉద్దేశ్యంగా కనపడుతుంది.
   పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కీలకం.
   అవి ప్రజల కోసం పని చేయాలి.
   కానీ కొన్ని కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కొరకు పని చేయకూడదు.
   అయితే, బిజెపి మొదటి నుంచి సంపన్న వర్గాల లబ్ధి కోసమే పని చేస్తున్నది.
   అందుకే ఆదానీ, అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజాలు వేలాది కోట్ల రూపాయలు బిజెపికి చందాల రూపంలో ఇస్తున్నాయి.
   అంతేకాదు, ఇజ్రాయేల్ ఏకంగా అరవై వేల కోట్లు ఆర్ఎస్ఎస్ కు చందా యిచ్చిందనే ప్రచారం వుంది.
   అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ బిజెపి ప్రభుత్వం పాలస్తీనాకు అన్యాయం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
   ప్రజల కోసం పని చేయాల్సిన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పోరేట్ కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని, వాటికి మేలు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి...?
   దేశ ప్రయోజనాల మాటేమిటి...?
   అన్న కీలకమైన ప్రశ్నతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించి, ఎలక్టోరల్ బాండ్ల చట్టాన్ని రద్దు చేసింది.
   అయితే, బిజెపి మతం పేరుతో, పథకాల పేరుతో యింటింటికీ ప్రచారం చేసుకుంటుంది.
   అదే నోటితే సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిందని కూడా చెప్తే బావుటుంది.
   అబద్దాలను ప్రచారం చేయడంలో చూపే ఆసక్తి, నిజాలను ప్రచారం చేయడంలో బిజెపి ఏనాడూ చూపించలేదు.
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

Post a Comment