Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మహిళలను ఎవరు మార్చాలి....?

మహిళలను ఎవరు మార్చాలి....?
   సమాజంలో అందరూ సమానమేనని ప్రజాస్వామ్యం చెపుతుంటే మాకు సనాతన ధర్మంలో బానిసత్వమే అద్భుతంగా ఉందన్న సోయి లో మహిళ లోకం ఉంది...!
   కొంత మంది మహిలు జై శ్రీరామ్,మరి కొంతమంది మహిళలు ఆమెన్ అని,మరి కొందరు హే హల్లా అని వారు కూర్చొన్న చోటునే సమాధిగా మార్చుకొంటున్నారు...!
   రామాయణంలో రాముడు తన భార్య సీతను అభరణ్యాలకు పంపిన రాముడు మహిళా లోకానికి ఆదర్శమని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి....!
   మహిళ సాధికారత కు ఏడు దశాబ్దాలుగా దూరంగా నెట్టివేయబడ్డ ధర్మం మహిళకు ఎలా పవిత్రమైనదో వారికే తెలియాలి...!
   మహిళలు చదువుకోవాలని ఒక మహాఉద్యమమే చేసి మహిళలకు అక్షర జ్ఞానాన్ని అందించిన సావిత్రి బాయి స్ఫూర్తి మహిళ లోకంలో ఇంకెప్పుడొస్తుది.
   మహిళా సాధికారత కోసం, మహిళకు సమాన అవకాశాలు ఇవ్వకపోతే ఈ పార్లమెంట్ లో నేను మంత్రిగా కొనసాగలేనని రాజీనామా చేసిన అంబెడ్కర్ ఆలోచనలు మహిళలు ఇంకెప్పుడు మహిళలు ఒంటబట్టించుకొంటారు.
   కులంతో అవమానాలు అనుభవిస్తున్న మహిళలే జై శ్రీరామ్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే ప్రజాస్వామ్య నాశనాన్ని మహిళాలోకం కోరుకోవడం కాక మరేమౌతుందో పార్లమంటులో పాలన కొనసాగిస్తున్న మహిళ ప్రజాప్రతినిధులు చెప్పాలి.
   సనాతన ధర్మం ప్రకారం మహిళలకు పాలించే అధికారం,చదువుకునే అధికారం ఆభరణాలు ధరించే అధికారం లేదు మరీ ఈ అవకాశాలు మహిళకు ఎవరిచ్చారన్నా ఇంకిత జ్ఞానం లేకపోతే ఎవరు మార్చాలి వీళ్ళను...!
   ఇంకా ఎంతమంది మహిళ సాధికారత కోసం చావాలి సనాతన ధర్మం ప్రకారం అంటరానితనంతో జీవిస్తున్నా వారిని హత్యలు, మానభంగాలు, చేసినా ధర్మం ప్రకారం తప్పులేదని సనాతన ధర్మం చెప్పుతుంది కానీ మహిళను కొట్టినా, కానీ మాటలు తిట్టినా హత్యాచారం చేసిన ఇంకే విందంగా వేధించిన చట్టప్రకారం శిక్షలు వేయాలని రాజ్యాంగం చెప్పుతుంది.
   దేశ ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులున్న కంచె నాటినట్లు చట్టం పనిచేస్తూ అడమగా అందరిని సమన్యాయం చేస్తున్నా రాజ్యాంగాన్ని విచిన్నం చేస్తున్న విచిన్నకారులకు మహిళాలోకం దన్నుగా ఉన్నారంటే చదువుకున్నా, చదువుకొని వారిలో అజ్ఞానం ఏస్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవాలి.
   ప్రపంచదేశాల్లో అనేక వాణిజ్య కంపెనీలకు సి ఈ ఓ లుగా పనిచేస్తున్న మహిళకు ధర్మం ప్రకారం కాకుండా జ్ఞానం ప్రకారమే ఉపాధి దొరుకుతుందన్నా విషయం మహిళాలోకం మారువరాదు.
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments