Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాడు ఈ ప్రాంత యువకులు కోరుకున్నదేమిటి...?

     కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగి లక్ష వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రేవంత్ రెడ్డి అనేక మార్లు  కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు, పిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
   అంతే కాదు ఈ ప్రాజెక్టు పై విచారణ జరిపించాలని, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కూడా చేసారు, ఐనా విచారణ చేయడంలో పురోగతి లేదంటే ఎవరిని నిందించాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.
   తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగిన బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపిస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితి...!
   ఎందుకంటే, నరేంద్రమోదీ ఈ దేశ ప్రధానిగా ప్రస్థానం మొదలెట్టిన నాటి నుండీ, నేటి వరకు బీఆర్ఎస్ తన పార్టీ పార్లమెంట్ సభ్యులను  బీజేపీ ప్రవేశ పెట్టిన మెజార్టీ  బిల్లులకు మద్దతు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరిచిపోయారని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు....!
   మరో విషయం బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చూస్తే నవ్వాలో...ఏడ్వాలో తెలియని పరిస్థితి...!
    తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలపై కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు పిర్యాదు చేసినా, అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల పై ఐటీ దాడులు జరగవు.
    లిక్కర్ కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్ర పోషించిందని బీజేపీ పార్టీ కేంద్ర, రాష్ట్ర నేతలు పత్రికా సమావేశాలు పెట్టి నిందితురాలు అని గగ్గోలు పెట్టిన బీజేపీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందొ తెల్వని ప్రశ్నా...?
అంతెందుకు లిక్కర్ కుంభకోణంలో విచారణకు వెళ్లిన అందరిని ఈ,డి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంఘటనలు చూసాం...!
   కానీ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించి 100 కోట్లు కొల్లగొట్టిందని స్వయంగా ఈ,డి చెప్పిన విషయం తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదు.
   కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ సర్కార్ ఆశీస్సులు కల్వకుంట్ల కవిత పై ఉండటం వల్లనే ఇప్పటికి కవితను అరెస్టు చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్,పార్టీల నుండి బయటకు వచ్చినవారే చెప్పుతున్నారు..!
   బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం పామ్ హౌస్ లో జరిగిన మొత్తం సంఘటనను కేసీఆర్ రికార్డ్ చేసి దేశంలోని అన్ని నిఘా వర్గాలకు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు, ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులకు, దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రతిపక్షా నేతలకు పంపిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవ్వరు చెప్పాలి....?
     కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది నిజం కాదా...?
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాడు ఈ ప్రాంత యువకులు కోరుకున్నదేమిటి...? ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు వస్తాయనే కదా...? మరి ప్రభుత్వం యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించిందా...?
     తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఫ్రొఫెసర్స్, నియామకాలు ఇప్పటి వరకు చేశారా..?
   తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు వారి జీవితాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తే వారికి దక్కిందేమిటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా...?
   ఏ పార్టీ చూసిన రైతులకు ఆర్థిక సహకారం ఇస్తామని, ఎరువులిస్తామని, వికలాంగులకు పెన్షన్ల ఇస్తామని, ఇరవై నాలుగు గంటల పాటు ఉచితంగా కరెంటు అందిస్తున్నమని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం, ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఏమి చేయాలో తోచక, ఆత్మహత్యలు చేసుకొంటున్నారు, ఇంకా ఎంతో మంది నిరుద్యోగులు అవస్థలు పడుతున్న వారి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు....!
   నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయలేదో ఎవరు చెప్పాలి...!
   ఐదేళ్లకోసారి ఇలాంటి అమలు కానీ హామీలను ప్రజల ముందు పెట్టి డబ్బులు పంచి ఓట్లేసుకొని గెలిచి ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వాలను ఓడించాలో... గెలిపించాలో ప్రజలే నిర్ణయించుకోవాలి....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

  1. Evi kaschitham ga Amalu kaani haamile sir...
    Asalu uchitha haamilu ye okka otaru kuda adagaledu kada sir ..
    Prajalanu uchithaalu ane mandu ku byasanaparulani chesthunnadu...
    Kaaneesa avasaralaina nanyamaina vidhya, vaidhyam uchithamnga ivvali sir...
    Appude kada oka samanya manishi brathaka galuguthaadu...ee adhika fees la nundi...

    ReplyDelete
  2. Excellent massage but need to think voters

    ReplyDelete

Post a Comment