Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రైతులంటే ఎవరు కేసీఆర్ ? రైతులంటే భూమి ఉన్నవారా? భూమిని దున్నేవారా?

   రైతులంటే ఎవరు కేసీఆర్ గారు... రైతులంటే భూమి ఉన్నవారా...? భూమిని దున్నేవారా...?
   ఒకసారి మీరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పితే బాగుంటుదని ఒక సూచన....!
   వ్యవసాయంలో లాభం లేదని గ్రామాల్లో భూములున్న భూస్వాములు గ్రామాల్లో భూమిలేక అల్లాడుతున్న వ్యవసాయ కూలీలకు భూమి కౌలుకు ఇచ్చి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వెళ్ళి కోట్లు సంపాదించిన వారేనా...? మీదృష్టిలో రైతులంటే....?
   ఒక్కసారి ఆలోచన చేయండి...!
   రైతులను ధనవంతులను చేయడమంటే భూమి ఉన్నా వారినా....!
   లేక వ్యవసాయ పంటలు పండించిన వారినా..?
   ఎవ్వరిని ధనవంతులను చేస్తారో జర అర్థం ఆయ్యేటట్లు చెప్పండి....!
   వ్యవసాయం చేయకుండా విదేశాల్లో కొలువులు చేసుకొని కోట్లు సంపాదిస్తున్నా వారికి 600 కోట్ల రూపాయలు మీరు రైతు బంధు క్రింద ఇచ్చారని ప్రచారం జరుగుతుంది...
   ఇది నిజమేనా...?
   ఒక్కసారి ప్రభుత్వ అధికారులతో రివ్వు చేస్తే మంచిదేమో...?
   ఎందుకంటే మీరు రైతులకు మేలు జరగాలని కోరుకుంటే మీ సుట్టున్న వారంతా సేవరూపంలో ఉన్నా వ్యాపారాస్తులే కదా...!
   ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను మొదటి స్థానంలో నిల్చోబెట్టింది ఎవరు...?
   కౌలు వ్యసాయం చేసిన రైతులా...?
   లేకపోతే పట్టపాసు పుస్తకాల్లో భూములున్న రైతులా......?
   ఎంత ఖర్చుయినా సాగును కాపాడుతామన్న మీ ఆలోచన చాలా మంచిదే...!
   కానీ సాగుచేస్తున్న కౌలు రైతు గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు....!
   ఆరుగాలం శ్రమచేసి, ఖర్చు పెట్టేది కౌలు రైతు...!
   విత్తన, ఎరువుల సబ్సిడీ న్యాయంగా కౌలు రైతులకే ఇవ్వాలి కదా...!
   పంటలు పండకపోతే, గిట్టుబాటు ధరలు లేకపోతే నష్టపోయేది కౌలు రైతులే కదా...!
   ఈ కోణంలో ఒక్కసారి ఆలోచించండి సార్...!
   రైతు ప్రభుత్వం అని ప్రపంచమంతా చెప్పే తెలంగాణలో పంట పండించే కౌలు రైతుల కష్టాల తీర్చే దిశగా కార్యాచరణ చేపట్టండి....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments