Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అధికారంలో ఉన్నప్పుడు ఒకతీరు...! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతారు,..! గొడవలకు దిగుతారు....!

  ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీపై విమర్శలు చేసుకోవడం సహజం...! అధికారంలో ఉన్నప్పుడు ఒకతీరు...!
   ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతారు,..!
గొడవలకు దిగుతారు....!
   రోడ్లన్నింటిని దిగ్బందం చేసి ప్రభుత్వనికి ఇబ్బందులు కల్పించి నిరసన ప్రదర్శనలు చేస్తారు...!
   అంతిమంగా ప్రజల శ్రేయస్సు కోసమేనని ప్రకటనలు చేస్తారు....!
   ఈ పార్టీలన్నీ నిజంగా మనకోసమే ఈ ఉద్యమాలు చేస్తున్నాయని మనం బ్రమల్లో ఉన్నాం... వుంటాం కూడా..!
   మరి మరాల్సింది ఎవరు..? మనమే....! అంటే ప్రజలే...!     ఎందుకంటే....?
   లక్ష కోట్లు ఖర్చుపెట్టి నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అల్లరి పెట్టే బీజేపీ పార్టీ, వెయ్యికోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ ఎందుకు జరుపదు...!
   కానీ ఎక్కడో ఢిల్లీలో జరిగిన 100 కోట్ల లిక్కర్ స్కామ్ పై విచారణ పేరుతో తెలంగాణాలో రాజకీయ వేడిని పుట్టించారు.
     తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరినా...!
   కోర్టులో కేసు వేసి విచారణ చేయాలని డిమాండ్ చేసినా...!
   కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ చేయరు..!
   ఎందుకని అంటే విచారణ పేరిట కేంద్రంలో అధికార పార్టీ, విచారణ ఎదుర్కొనే పేరిట రాష్ట్రంలో అధికార పార్టీ ప్రభుత్వలు నాటకాలు అడుతున్నాయన్న విషయం తెలంగాణ ప్రజలకు, మేధావులకు అర్థమైంది. అర్థమౌతున్నది...! కూడా...!
   లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఇ,డి నోటీసులు ఇచ్చి, విచారణ చేస్తే ఏమైంది...! ఆమె దోషా...? కదా... ? అనేది... తేల్చలేదు...!
   ఛార్జ్ చీట్ వేశామని, అందులో ఎమ్మెల్సీ కవిత పేరున్నదని ఒక్కసారి, లేదని మరోసారి నిఘా సంస్థలు చెప్పుతూ ఉన్నాయి.
     మరి నిజమేమిటి...? తేల్చేదేవరు...? ఎప్పుడు తేల్చుతారు...!
    రాష్టాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలయ్యే నిఘా సంస్థల విచారణ అధికార బదలాయింపు జరిగేవరకు కొనసాగుతూనే ఉంది....!
   ఇలాంటి విచారణలు ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నిస్తాయి...!   
   కొద్దీ రోజులు డ్రగ్స్ మాఫియా హడావిడి...!
   ఇది మరువక ముందే సినిమా యాక్టర్లును విచారణ పేరుతో కొద్దీ రోజల హడావిడి,...!
   ఇగ చూడు ఈ రెండు మరవక ముందే ఎమ్మెల్యేల కొనుగోలు గొడవను తీసుకొచ్చారు...!
   ఈ విషయం మరిచిపోతే ప్రజలు ఎక్కడ ప్రభుత్వం పై తిరగబడతారో అని లిక్కర్ స్కామ్ గొడవను కొన్నాళ్ళు నడిపించారు...!
   హ ఇక్కడితో వీళ్ళ చాప్టర్ ముగిసింది అనుకునే సమయానికి పేపర్ లీకేజీ లొల్లి తెచ్చిపెట్టేశారు...!
   ఇలా ఎన్నో, ఎన్నెన్నో సంఘటనలతో తెలంగాణ సమాజంలో ఎప్పుడు రాజకీయ వేడిని సృష్టించి పబ్బం గడిపే ఒక కార్యాచరణ అమలు తప్ప ...! మరోటి లేదు కాదంటారా....?
చర్చ చేయండి...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

  1. Excellent concept
    Good identification of problem

    ReplyDelete
  2. మరి మీరేం చేస్తున్నారు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే గదా?

    ReplyDelete

Post a Comment