Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

పక్కోని సంపాదన చూసి నిజాయతీ గల అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు...!

   తెలంగాణ నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TNGOS) కు ఇండ్ల స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని కడిపి కొండ గ్రామంలో 32 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేటాయించారట....!
      దీనిపై ఒక్కసారి చర్చ చేద్దాం...!
మీతో పాటు ఉద్యోగం చేసి రిటైడ్ ఐన వారిని అడిగితే చెబుతారు మీగురించి...!
పెన్షన్ ఇవ్వడానికి మీరు ఎన్ని అవస్థలు పెడుతారో ఎంత నరకం చూపిస్తారో...!
    పక్కోని సంపాదన చూసి నిజాయతీ గల అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు...!
    ప్రభుత్వం ఒక్కసారి వీరిపై విచారణ జరిపించాలని నిజాయితీ కల్గిన ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు....!
నెలకు మంచి జీతం ఒక్కటో తారికునే రావాలి...!
డి ఏ, టి ఏ, లు ఇవ్వాలి, ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి...!
   ఇంకా అలవెన్స్ లతో పాటు ప్రభుత్వం నుండీ రావాల్సిన అన్ని బెనిఫిట్స్ పొందుతారు... ఒక వేళ ప్రభుత్వం సరైన సమయంలో జీతం చెల్లించకపోతే సమ్మెకి దిగి ప్రభుత్వవాన్ని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారు....!
ఇంకా పనిని బట్టి లంచం, అందులో అఫిసర్ స్థాయిలో ఒకతీరు, అటెండర్ స్థాయిలో ఒక తీరు, లంచం లేకుండా ఏ పని జరుగదు....!
ఇది ఎవరు నమ్మిన నమ్మక పోయినా నిజం... నిజం... నిజం....!
   ఈ తంతు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంది...! ఉద్యోగులకు ఇబ్బందిగా ఉన్నా ఇదీ నిజమే... కాకపోతే కొంతమంది ఉద్యోగులు నిజాయతీగా పనిచేసేవారు ఉన్నారు...!
   గతంలో ఉద్యోగులు చేస్తున్న పనిలో నిర్లక్ష్యం జరిగితే పత్రికల్లో వార్తలు వస్తే ఎంతో సంచలనం... కానీ ఇప్పుడు సాధారణం...!
   ఇంకా పైగా వార్త రాసిన రిపోర్టర్ ను పీలిచి మ్యానేజ్ చేసుకోవాడమో. లేక బెదిరించడమో ఇంకా ఎక్కువ మాట్లాడితే పత్రిక మేనేజిమెంట్ ను కలిసి ఆ నిజాయితీ కలిగిన రిపోర్టర్ ఉద్యోగం తీపించే స్థాయిలో ఇప్పటి ఉద్యోగులున్నారంటే నమ్ముతారా..?
నమ్మాలి......!
   టిఎన్జీవోలకు డబ్బులు తక్కువ వున్నాయా? వాళ్లకుఒక్కొక్క ఉద్యోగికి ఉండటానికి ఇల్లు కలిగి అదనంగా అనేక ప్లాట్లు కలిగిన ఎంతో మంది ఉంద్యోగులున్నారు. ఉండటానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఒక్క గజం జాగా ఇవ్వడానికి మనస్సు లేని ప్రభుత్వం వీళ్లకు మాత్రం ఎకరాలకేకరాలు భూమి ఇస్తున్నది....!
ఇది డబుల్ స్టాండర్డ్ కాదా...?
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments