Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఈ దేశంలో ప్రస్తుతం పరిపాలనలో ఉన్నా పాలకులకు డార్విన్ సిద్ధాంతం ఎక్కడ ఇబ్బందిగా మారిందో...!

   ఈ దేశంలో ప్రస్తుతం పరిపాలనలో ఉన్నా పాలకులకు డార్విన్ సిద్ధాంతం ఎక్కడ ఇబ్బందిగా మారిందో...!
   తొలిగించాలని ఎందుకు...? ఆలోచన చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలి...!
   దేశ నియమావళి ప్రకారం రాజ్యాధికారం కావాలంటే ఓట్ల ద్వారా అధికారం కావాలి...!
   🔎అధికారం కావాలంటే, కులం ఉండాలి...!
   🔎కులం ఉండాలంటే, మతం ఉండాలి...!
   🔎మతం ఉండాలంటే, దేవుడు ఉండాలి...!
   🔎 దేవుడు ఉండాలంటే సైన్స్ ఉండకూడదు...!
   ప్రస్తుతం మన పాలకులు ప్రజలను సైన్స్ వైపు రాకుండా దేవుని వైపు తీసుకెళ్తున్నారు..!
   ప్రజలకు ఈ విషయం అర్ధం ఐయ్యేవరకు మరో వందేళ్లు పడటం ఖాయం...!
   పిల్లలకు చిన్నప్పటి నుండి శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం అవసరమా...?
   లేక దేవుడు, దయ్యం, కులం, మతం, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, ప్రజల ఓట్లను డబ్బులతో కొనడం, గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి రావడం, ఇదేనా మన పాలకుల విధానం ఇలా చేస్తే దాన్ని ప్రజాస్వామ్యం అంటారా.....?
   మనం పిల్లలకు నేర్పే విద్యా ఇదేనా...?
   పాలకులకు చట్టమంటే గౌరవం లేదు...!
   ప్రజలంటే ఎన్నికల రోజు వేయ్యో... ఐదొందలో, ఇచ్చి గెలిచి, మరో ఐదు సంవత్సరాల పాటు దర్జాగా ప్రజల రక్తాన్ని పీల్చుకుని తినే విధానమేన....!
   మనం పిల్లలకు నేర్పే విద్యా విధానం...!
   ఒక ప్రభుత్వం మేము గొప్పగా అంబెడ్కర్ విగ్రహాన్ని పెట్టి అదే అభివృద్ధి అని మాల్లోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది...!
   మరొకరు...మేము రామమందిరం కాట్టామని, ఈ దేశం మొత్తము హిందూ దేశమని మసీదులను తవ్వుతామని, ముస్లిం రిజర్వేషన్లు మేము అధికారంలోకి వస్తే తొలిగించి దళితులకు, బీసీలకు ఇస్తామంటుంటుంది...!
   మరి రాజ్యాంగం ఏమి చెప్పుతుంది...! పాలకులు ఏమి చేస్తున్నారు...?
   ఎవరాలోచించాలి...?
   చరిత్రను ఎవరైనా చేరిపేయగలరా...?
   ఈ దేశంలో పేదోడు ఇంకా పేదోడిగానే ఎందుకుంటున్నారో పాలకులకు పట్టదు....!
   ప్రజలు ఆలోచన చేయరు.....! మరేట్లా...?
   ఈదేశం బాగుపడేది ఎట్లా..!
సైన్స్ అనేది మనిషి తన అనుభవం, ఆచరణ ద్వారా, అన్వేషణ ద్వారా తయారు చేసిన జ్ఞానం. మతం వికృతరూపం దాల్చిన యూరప్ దేశాల్లో సైన్స్ వికసించింది. డార్విన్ అనే సైంటిస్ట్ మనిషిని దేవుడు సృష్టించలేదని, జీవ పరిణామ క్రమంలో మనిషి ఏర్పడ్డాడని నిరూపించాడు కదా...! దాంట్లో నిజము ఉందా...? లేదా...? పిల్లలు తెలుసుకునే అవసరం లేకుండా చేయడమేనా...? ప్రభుత్వవాల పని....!
   ఈదేశ విద్యార్థిని విద్యార్థులకు, ఉపయోగపడే ఆ డార్విన్ సిద్ధాంతం సైన్స్ ను బోధిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల నుండి తొలిగిస్తారా...?
   అంటే వర్ణ కుల వ్యవస్థను దేవుడు సృష్టించాడని, మనిషిని దేవుడే కులాలుగా వర్ణాలుగా సృష్టించాడని చెప్పే సనాతన ధర్మానికి డార్విన్ సిద్ధాంతం ఎదురు నిలబడి సవాలు విసురుతుంది....! అందుకే ఆ సిద్ధాంతాన్ని తొలిగిస్తున్నారా..?
   ఇలాంటి నిర్ణయాలు దేశానికి దేశంలోని విద్యార్ధిని విద్యార్ధులకు ఎప్పటికీ మంచి చేయవు....!
   కాదంటారా...?
వీలైతే చర్చ చేయండి....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments