Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

న్యాయ వ్యవస్థలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది...!

   ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరిగే ప్రాంతంగా, పేరున్నా తెలంగాణ రాష్ర్టంలో న్యాయానికి, అన్యాయమే జరుగుతుంది....!
   మానవ వనరులు సమృద్ధిగా ఉండి, సకల సంపదలు కల్గిన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా ప్రాంత నేతలు దోపిడీ చేస్తున్నారని ఉవ్వెత్తున రగిలిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు అగ్నికి ఆహుతై తెగబడి, కలబడి, నిలబడి తెలంగాణ రాష్ట్రం సాదించుకొని సుమారు పదేళ్లు దగ్గరపడ్డది....!
   ఇప్పటికి న్యాయ వ్యవస్థలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుంది...! ఇది ఎవరి నిర్లక్ష్యం అనుకోవాలి....?
   దేశంలోని కేరళ, తమిళనాడు, తదితర రాష్టాల్లో న్యాయ మూర్తుల నియామక ప్రక్రియ ఆయా రాష్ట్రల పబ్లిక్ కమిషన్ ద్వారా ఎంపిక చేసుకోవడం వల్ల ఆయ రాష్టాల నిరుద్యోగులకు ఉపయోగం జరుగుతున్న సంగతి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి తెలియదా...? పరిపాలన చేతికొస్తే చాలా...! మీరు ఈ విషయంలో అంతకరణ శుద్దితో ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే మీకు ఎవరు అడ్డం...?
   తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికె కనుక జరిగినట్లు ఐతే లోకల్ విద్యార్థినీ, విద్యార్థులకు రిజర్వేషన్ అమలుతో పాటు 610 జీవో అమలు కూడా ఔతుంది...! దింతో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని 85% శాతం విద్యార్థులకు ఉపయోగం,
   ప్రస్తుతం తెలంగాణలో 25% శాతం కోటా కుడా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కడం లేదు.
   ఈ విషయంలో హైకోర్టు న్యాయవాదులు కొంత మంది హైకోర్టులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జ్యూడిషల్ నియామకాలు చేపట్టాలని ఒక రిట్ పిటిషన్ ను హైకోర్టులో వేస్తే హైకోర్టు కొట్టివేసింది. మరి ఇలాంటి విషయాల గురించి ఎవరు పట్టించుకోవాలి...? డెబ్భై ఐదేళ్ల నుండి తెలంగాణ జ్యూడిషల్ వ్యవస్థలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయమే జరుగుతుంది ....? ఈ సమస్యకు పరిష్కారం మరెప్పుడు...!
   తెలంగాణ నిరుద్యోగులకు ఎంత నష్టం కలుగుతోందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి..! వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల విజ్ఞప్తిని పట్టించుకునే నాధుడు ఎవరు...!
   హైకోర్టు న్యాయ వాదులు వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు ఎందుకు కొట్టివేసిందో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం విచారకరం...!
   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ మెంట్ చేయడం వల్ల రిజర్వేషన్లు అమలుతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కోర్టుల్లో పేరుకుపోయిన కేసులన్నింటిని తొందరగా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన జ్యూడిషియల్ అధికారులు జ్యూడిషల్ సెక్టార్లోకి ప్రభుత్వాన్ని చొరబడనీయడం లేదన్న విషయం అర్ధం ఔతుంది.
   హైకోర్టులో ఎస్సీ, ఎస్టి, బీసీ కులాలకు చెందిన జడ్జీలు లేరు, ఉన్నా వారి పరిధి దాటి ఆయావర్గాలకు న్యాయం జరుగాలనే ఆలోచన చేసే అవకాశం లేదు. కాబట్టి హైకోర్టులో జ్యూడిషల్ అధికారుల యొక్క అజమాయిషీనే నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
   తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రా ప్రాంతానికి చెందిన జడ్జీలు బదిలీల్లో ఆప్షన్ అడిగితే ఆంధ్రా జడ్జిలు తెలంగాణా లో ఆప్షన్ ఇవ్వడమేమిటి...?
   ఇక్కడే తెలంగాణా వారికి నష్టం జరుగుతుంది...!
   తెలంగాణలో ఆప్షన్ ఇవ్వడం వల్ల తొందరగా హైకోర్టు న్యాయమూర్తి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణ వొదిలి వెళ్ళటం లేదు...!
   దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జ్యూడిషల్ నియామకాలు చేస్తున్నప్పడు, తెలంగాణలో ఇలా ఎందుకు జరుగుతోందో అడిగే నాధుడు లేడు...!
   ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కల్పించుకుని తెలంగాణ నిరుద్యోగులకు అవకాశం కలిపిస్తే స్థానికులకు న్యాయం చేసిన వారు అవుతారు...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments