Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యక కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

   సామాజిక వెనుక బాటుకు గురైన కులాలకు రాజ్యాంగ బద్దంగా కల్పించిన రిజర్వేషన్లు పాలకుల అలసత్వం వల్ల కనుమరుగై పోతున్నాయి.
   బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యక కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం పాలకుల వంతుగా మారిపోయింది.
   ఎస్సీ, ఎస్టి, బీసీ మైనార్టీకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పుకునే అన్నిపార్టీలు 1990 సంవత్సరం నుంచి రిజర్వేషన్లు కు చరమగీతం పాడారు.
ప్రెస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రతి రోజు ఈ దేశంలో 550 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.
   రిజర్వేషన్లు ఎక్కడ అమలౌతున్నాయి అని ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తారు...!
   జనాభాలో 5% శాతం లేని వారికి మాత్రం 10% శాతం రిజర్వేషన్ఇచ్చి 56% శాతమున్న బీసీలకు మాత్రం 24% శాతం ఇస్తాం...! అంటారు గాని ఇవ్వరు...! ఇది ప్రభుత్వవాల తీరు....!
   ప్రజల నుండి తిరుగుబాటు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తామని ప్రణాళికలు సిద్ధం చేసి ఎన్నికలైపోయిన తర్వాత మోసం చేస్తారు... చేస్తూనే ఉన్నారు.
   ప్రజల భౌతిక సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు మతోన్మాద, భావోద్వేగాలతో, సమస్యలను సృష్టించడం తప్పా ఈ నిర్ణయం వెనుక మరోటి లేదు...!
తిండికి లేక సతమతమవుతున్న వారిని మరింత గందరగోళం లో పడేసే ప్రకటనే తప్పా మరోటి కాదు. వారి ఆర్దిక దోపిడీని నిరంతరాయంగా కొనసాగించడం కోసం ఆధ్యాత్మిక విషయాలు, మతపరమైన అంశాలు సమాజంలో వొదిలి రాజకీయ లబ్ధ్ది పొందటం కోసమే అన్నట్టు అమిత్ షా ప్రకటనలు అర్థమౌతున్నాయి.
   గుప్పెడు మంది ఆర్దిక, ఆధ్యాత్మిక, దోపిడీ దారుల కోసం కోట్లాది ప్రజలను ఆర్దికంగా కొల్లగొడుతూ ఆధ్యాత్మిక బానిసత్వంలోకి నెడుతున్న మోడీ, అమిత్ షా నిజస్వరూపాన్ని ప్రజలు తెల్సుకోవాల్సి ఉంది.
   ప్రస్తుతం ఈదేశ ప్రజలను పేదల, పక్షపాత, కర్మ సిద్ధాంత, రహిత భావజాలం మాత్రమే రక్షించగలదు. అలాంటి భావజాలం గల శక్తులను బలోపేతం చేసుకోవడంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉంది....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments