Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

దేశంలో, రాష్ట్రంలో నిత్యం ఏమిటి ఈ గోళా....?

   దేశంలో, రాష్ట్రంలో నిత్యం ఏమిటి ఈ గోళా....?
   ఇదేనా...? పరిపాలకులు చేసే ప్రజారంజక పాలన ...!
   ప్రతిరోజూ మీడియాలో ఈడి, సిబిఐ, సి ఐ డి, అల్లరి.......!
ఈ దాడులు ఎవ్వరినీ ఉద్ధరించడానికో అర్థం కాని పరిస్థితి...!
   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనను గాలికొదిలి, బజారున పడి ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఎవరికి లాభం....?
   లిక్కర్ స్కాం, ప్రశ్న పత్రాలు లీకేజీ, డ్రగ్ మాఫియా, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో స్కామ్లు జరుపుతూనే ఉన్నారు...!
   ఒకపార్టీ పై మరో పార్టీ మాటల దాడి, ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ వీది, గొడువలకు దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు....!
   చిల్లర పనులు చేసే పిల్లలతో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా బండి సంజయ్ ప్రశ్నపత్రాలను ఒక పథకం ప్రకారం కాపీయింగ్ చేపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం కోసం వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టడంతో కంగుతిన్న బండి సంజయ్ ఒక్కరోజే జైల్లో ఉండి తిరిగి వచ్చారు. సంజయ్ కి బెయిల్ ఇవ్వలనే వాదన ఉదయం 10 గంటల నుండి రాత్రి 10:15 వరకు సాగి చివరికి బండి సంజయ్ కి కోర్టు బెయిల్ ఇచ్చింది మరి సామాన్యుల విషయంలో ఇలా ఎందుకు జరగడం లేదు...!
   అంటే డబ్బులు, పలుకుబడి ఉన్నా రాజకీయ నేతలకు కోర్టుకు సెలవులు ఉన్నా బెయిల్ ఇచ్చే వెసులుబాటు ఉందన్న విషయం బండి సంజయ్ కేసులో అర్థమైంది. పోరాటాల ఓరుగల్లులో పోలీసులు నేరస్తుడిగా చూపిన సంజయ్ కి బెయిల్ ఇవ్వలని సుమారు 10 గంటలపాటు సుదీర్ఘంగా ఆర్గుమెంట్ జరిగిన కేసుగా ఈకేసు రికార్డ్ కెక్కింది....!
   దేశంలో, రాష్ట్రంలో ఎవరి రాజకీయాలు వారివి.....!
కానీ....!
   బాధితులుగా...! మాత్రం ప్రజలు, పోలీసులు, అధికార యంత్రాంగం, ఉద్యోగులే ఔతున్నారు...!
   దేశంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం, మహిళలు, విద్యార్థిని విద్యార్థులు, ఇంకా అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు...!
   పాలకులకు ఇవేమీ పట్టవు...! తిరిగి అధికారలోకి రావడానికి అవసరమైతే అన్ని వర్గాల ప్రజలను, అధికారులను బలి తీసుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం...!
   ప్రజల సమస్యలు, అవసరాలు ఎవ్వరికీ పట్టవు..!
రాజకీయ నాయకుల,పార్టీల స్వార్థ రాజకీయాల కు ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు బలౌతున్నారు.
   నాడు నిస్వార్ధంగా పనిచేసి గౌరవంగా, మచ్చలేని ఐ పి ఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నా శ్రీలక్ష్మికి రాజకీయ నాయకులు, పార్టీలు ఒత్తిడి చేసి తప్పులు చేపించడం వల్ల ఒక గొప్ప అధికారిగా పేరున్న శ్రీలక్ష్మి వ్యక్తిగత జీవితం మొత్తం నాశనమై పోయి ప్రస్తుతం కోర్టులు, లాయర్లు, పిటిషన్లు, అని రోడ్డున పడ్డ సంగతి ఇంకా ప్రజలు మరిచిపోలేదు....!
   కానీ కోట్లకు కోట్లు, డబ్బులు సంపాదించి కోట్లకు పడగెత్తిన గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజ్యమేలుతున్నారు...!
   ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలకు, యువకులకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోయి ఈ దేశ ప్రజాస్వామ్యం అంటేనే రోత పుట్టేవరకెల్లింది...!
   అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడాలి...!
   ఆలోచన చేయండి...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments