Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రపంచంలో ఎంతో చైతన్య వంతమైన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ కు ఎంతో ఘనకీర్తి ఉంది.

   ప్రపంచంలో ఎంతో చైతన్య వంతమైన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ కు ఎంతో ఘనకీర్తి ఉంది....!
   దేశంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలపై గలమెత్తి, ఎంతో మంది అమరులైన ఈ నేలపైన జరుగుతున్న సంఘటనలు చూస్తే ఈ నేల చైతన్యం ఏమైపోయిందో అర్థం కావడం లేదు....!
   తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో పోరాటం చేసి సాదించుకొన్నా తెలంగాణ లో ఇప్పుడు జరుగుతున్నా పరిణ మాలేమిటి...?
   లిక్కర్ స్కాం లో అనుమానితురాలిగా కెసిఆర్ కూతురు కవితకు ఇడి, నోటీసులు జారీ చేసి విచారణ కోసం పిలిస్తే కవిత కామ్ గా వెళ్లకుండా, కోర్టుకు వెళ్లి ఈడి ప్రశ్నిచకుండా ఆర్డర్ ఇ వ్వలని పిటిషన్ వేయడాన్ని తెలంగాణ సమాజం ఎలా అర్థంచేసుకోవాలి...!
   కవిత ఇడి ఆఫీస్ కెళ్లడం అనేది ఏదైతే ఉందొ దాన్ని నిత్యం ప్రచార మాధ్యమాల్లో చూపిస్తున్న మీడియా తంతు చూస్తే ఈగొడువలు ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం కావడం లేదు.
ప్రజల అవసరాలు ఏమిటో...? తెలుసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లవలసిన మీడియా నిత్యం ఒక పార్టీ పై మరో పార్టీ చేస్తున్నా విమర్శలను ప్రాదాన వార్తలుగా రోజంతా చూపిస్తూ రాష్ట్రంలో జరుగుతున్నా అనేక సామాజిక అంశాలను తుంగలో తొక్కాతున్నారు.
   పోరాడి సాధించుకున్న తెలంగాణ లో యువతకు ఉపాదిలేదు,రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. స్ర్తిలకు రక్షణ లేదు. విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు, ఉపాధి లేదు, ఒక్కటేమిటి తెలంగాణలో ఎన్నో పరిష్కారం కానీ సమస్యలున్నాయి తెలంగాణ లోఎవ్వరూ సుఖంగా లేరు. ఒక్క రాజకీయ నాయకులు తప్పా...!
   నిజాలను ప్రజలకు చెప్పే మీడియానే ప్రజల సమస్యలను గాలికొదిలి నేతల ముచ్చట్లను చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments