Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రభుత్వ ప్రధాన పరిశ్రమలు ప్రైవేటు పరమైనప్పటికి ప్రజల కోసం ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎంపి లకు పట్టింపు లేదు...!

ఈదేశంలో పేదరికం ఎప్పుడు నశిస్తుందో...?
-----------------------------------------------
   పేదోళ్లకోసమే మా పార్టీలు పుట్టాయని గత డెబ్బై సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు చేప్పుకొంటున్నాయి...!
   మరి ఎందుకు పేదరికం అంతం కావడం లేదో ఈదేశ పౌరులకు అర్థం కాని పరిస్థితి....!
   దేశంలోని ప్రజలకు తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి నీడ అనేవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు....!
   మరి ఎందుకు ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదు...!
   కారణము ఎవరన్నా విషయంలో యువతకు పట్టింపు లేదు,
   దేశ యువతకు విద్య,ఉద్యోగం, కనీస అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వవాలు అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనపడుతాలేవు...!
   ప్రణాళికలు వేస్తారు కానీ అమలు విషయాన్ని గలికొదిలేస్తారన్న విషయం చాలా సార్లు ధ్రువపడింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశ యువతరానికి ఏమిచేయలో తోచక రొడ్డన పడి ఆత్మహత్యలు చేసుకొన్నా సంఘటనలు కోకొల్లల్లు...!

   ప్రభుత్వ ప్రధాన పరిశ్రమలు ప్రైవేటు పరమైనప్పటికి ప్రజల కోసం ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎంపి లకు పట్టింపు లేదు...!
   పైగా మైక్ దొరికితే పేదప్రజల అభ్యున్నతికి మేము,మాపార్టీ కట్టుబడి ఉన్నామని గొప్ప గొప్ప కబుర్లు చెప్పటం దగ్గరే అన్ని రాజకీయ పార్టీల కార్యాచరణ ఆగిపోయింది...!
   ఈ దేశంలోని ప్రజలకు సరైనవిద్యా, వైద్యం అందదు...!
   ప్రజల కు పౌష్టికాహారం దొరకక అనేక మంది పేదలు వారి జీవితాలను మధ్యలోనే చాలిస్తున్న సంఘటనలు ఎన్నో..ఎన్నోన్నో...!
   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పథకాలు ప్రవేశపెట్టి ఎన్నికలైన తర్వాత గోడకేసిన పథకాలెన్నో...!
   ఒకాయన నల్లధనం బయటకు తెస్తానని, మరొకాయన రైతు రుణాల మాఫీ చేస్తామని చెప్పి ఎనిమిదేళ్ళ గడిచిన హామీలు నెరవేరింది లేదు...!
   ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేసుకొని ప్రజలను మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా...? ఎవరడగాలి...!

   ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపి ఐతేనే తరతరాలకు సరిపడే సంపద రాజకీయ నేతలకు ఎలా వస్తుందో ప్రజలు ఆలోచన చేసి మరమ్మత్తులు చేయాల్సి ఉంది....!
   అన్ని రాజకీయ పార్టీల విధానాల కారణంగా ప్రజలకు భారత రాజ్యాంగం పై నమ్మకం పోయే రోజులు దాపురించాయి..!
   రాజకీయ పార్టీల వ్యవహారాలన్నిటికి విసిగి వేసారిన ప్రజలు ఓటుకు దూరంగా ఉండలనే నిర్ణయానికి వచ్చారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు....!
   దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పిస్తే రాజకీయ నేతల,పార్టీల చర్యల పర్యవసానంతో రాజ్యాంగం నాశనమై మళ్ళీ తిరిగి బానిసత్వం లోకి వెళ్ళాక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయనడంలో సందేహం లేదు....!
మరి ...! ఎమిచేద్దామో ప్రజలు ఆలోచన చేయండి...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments