Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రభుత్వవాలు ఇలాంటి సేవలు ప్రజలకు చేయడం వల్ల యువత ఆరోగ్యం నాశనమైపోయి ఆసుపత్రిపాలు అవుతున్నారు..

   ఇంకా ఎంత కాలం..
   ఈ ఘోరం..
   ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాల అరాచకాలు, అక్రమాలు...!
   ఇంకా ఎంత కాలం...!
   వేల ఏండ్లుగా ప్రజలు అనుభవిస్తున్న క్షోభ ఇప్పటికి తప్పడం లేదు.
   మారాల్సింది ఎవరు....?
   మార్చాల్సింది ఎవరిని....?
   మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిందే.
   దేశంలో పేదరికం ఇంకా ఎంతకాలం?
   ఎవరు చెప్పాలి...!
   దేశాన్ని పాలించాల్సిన మెజారిటీ సమాజం ఎందుకు వెనుకబడుతుంది..?
   మనకు ఎప్పుడు అర్థమౌతుంది....!
   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరించాలి?
   ఒక ప్రభుత్వం లిక్కర్ మాఫియాతో సతమతమౌతుంటే, మరో ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
   స్వతంత్ర దర్యాప్తు సంస్థలను పాలకులు జేబు సంస్థలుగా మార్చుకొని ప్రజల మౌలిక అవసరాలను మరిచిపోయారు...!
   మరేట్ల....?
   తెలంగాణలో ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్ళుమొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వెంటనే ఎమ్మెల్సీ ఆయ్యడంటే ఇంత కాలం ఆయన సేవలు ఎవరికందాయో మనం అర్థం చేసుకోవాలి.
   మరో చోట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెలుగొందిన వ్యక్తి పదవి విరమణ తెల్లరే రాజ్యసభ సభ్యుడిగా నీయమించ బడ్డాడంటే వారి సేవలు దేశంలోని ప్రజాలకందినట్లా, లేక పార్టీకి అందినట్టా...?
   కేంద్రం చేసిన బిల్లులన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా ఓటేసి ఇప్పుడు దూషణలకు దిగుతున్నారంటే ప్రజలు ఆలోచన చేయరా...?
   దేశంలో అనేక సమస్యలు ఉన్నా వాటి గురించి ప్రభుత్వవాలకు సోయిలేదు.
   దేశంలో నిరుద్యోగం, స్వయం ఉపాధి, మహిళా సాధికారిత, భృణ హత్యలు, మత్తు మందుకు యూవత బానిసై ఉమెన్ ట్రాఫికింగ్ తదితర తీవ్రమైన సమస్యలు ఉన్నా ప్రభుత్వవాలకు వాటిపై పట్టింపు లేదు సరికదా....!
   ప్రభుతవ్వాలే ఇంటింటికి నల్లా నీరులాగానే మద్యం ఘాట్కా, నల్లమందు, సిగరేట్ అంబర్ ఇంకా ఎన్నో ఎన్నోన్నో మత్తు మందులను గ్రామాల్లోకి తెచ్చి పసిపిల్లలకు అన్ని దురాలవాట్లు చేసి తద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుంటుంది.
   ప్రభుత్వవాలు ఇలాంటి సేవలు ప్రజలకు చేయడం వల్ల యువత ఆరోగ్యం నాశనమైపోయి ఆసుపత్రిపాలు అవుతున్నారు..
   రైతుల ఆర్థిక పరిస్థితి విషమంగా మరి ఆసుపత్రి బిల్లును కట్టలేక ఉన్న భూమిని అమ్ముకొని బ్రతుకు దెరువు కోసం పట్టణాలకు వలసలు వచ్చి కొంత మంది దొంగలుగా తయారై సమాజ విచ్చిన్నానికి కారణమౌతున్నారు...!
   ప్రభుత్వవాల అసమర్ధ విధానాల వల్ల ప్రజలు ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడి నాయకులు ఇచ్చే పదికి, పైసకు ఆశపడి నాయకుడికి అనుచరులుగా, సాంఘీక నేరస్థులుగా మారుతున్నారు...!
   కాదంటారా...?
   చర్చ చేయండి...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments