Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అతడి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు.

-----------------------------------------------
ప్రపంచం మొత్తం ఈ దేశాన్ని చూసి మురిసి పోవాలని కలలు గన్న అంబెడ్కర్ ఆలోచనలు రోజురోజుకు మురికి కుపాల్లో మునిగిపోతున్నాయి...!
   అంబేద్కర్ పుట్టినరోజును ప్రపంచంలోని అన్ని దేశాలు (జ్ఞానం) నాలెడ్జ్ డే గా జరుపుకుంటే ఆయన పుట్టిన ఈ దేశంలో ఆయనకు దండలేసి ఆయన వదిలి వెళ్లిన ఆశయాలు,ఆలోచనలు,ఆయన ఈ దేశ సంపదగా ఇచ్చిన రాజ్యాంగం రోజు,రోజుకు పలుచన ఔతుంది...!
   అంబేద్కర్ మావాడే అని ఓన్ చేసుకుంటున్నా ఎస్సీ,ఎస్టీ, బీసీలు, సంక్షేమ పలాలకు అలవాటు పడి అధికారం మాత్రం పిడికెడు మందికి అప్పగిస్తున్నారు..
ఈ దేశ ములవాసుల ఆలోచనలు చివరికి ఎక్కడికెల్లాయంటే మేము పుట్టినప్పుడు మాహిందూ మతాన్ని అవమాన పరిచిన అంబెడ్కర్ ని ఉరితీసి ,హత్యచేసి, చంపే వాడినని ఒక సనాతన ఫాసిస్ట్ స్టేట్మెంట్ ఇంత బహిరంగంగా ఇస్తున్నాడంటే ఆయన వెనుక ఎవరున్నారో...?
వెతకండి...!
   అతడి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. ఆయన మాటల్లో భారత రాజ్యాంగం ద్వారా కోట్లాది మంది హిందువులకు స్వేచ్చా, స్వాతంత్రాలు కరువై వారి మనోభావాలన్నీ రేప్ కు గురైనట్లు పక్రటిస్తున్నాడు...!
   రాజ్యాంగం దేశంలోని పౌరులకు సమాన విలువ కలిగిన ఓటును ఇచ్చింది.
   కానీ మా హిందువులను భారత రాజ్యాంగం మోసం చేసిందంటున్నాడు అతడు.
   అంటే తక్కువ జాతికి అంబేద్కర్ ఓటేలా ఇస్తారు...!
మేము, కులం తక్కువ వాళ్ళు సమనమెట్ల ఔతాము...!
   ఇది ఆయన సందిస్తున్న ప్రశ్న....?
ఈ దేశంలోని మొత్తం భూమిని సాగుచేసి అన్నం పెడుతున్న శ్రామిక జాతులు నిత్యం రేప్ లకు గురై హత్య చేయబడుతున్నారు...!
   దేశ స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని చంపిన గాడ్సేను తన హీరోగా,భారత రాజ్యాంగం రాసినా అంబేద్కర్ ను అంటరానివాడగా ప్రకటిస్తున్న ఆ ఫాసిస్ట్ తన మైండ్ లో ఎంత కులోన్మాదం,మతోన్మాదం ఉందొ బహుజనులు అర్థం చేసుకోండి..!
  పిడికెడు మంది దోపిడీ కులాలకు అధికారం అప్పగించడం కోసము మీరు బలికాకండి..!
   మీ పుణ్యన కులాన్ని,మతాన్ని మోస్తున్న నీ రక్త బంధువులు మీ, మా నేత గాంధీ కోరుకున్న విధంగా కూడుకోసం, గూడుకోసం, కట్టడానికి బట్టకొసం అలమాటిస్తున్నారు...!
   ఇదేనా...?
   మీరు కోరుకొన్నా పరిపాలన, పైగా దేశంలోని సమస్యలకు అంబెడ్కర్ కరణమన్నట్టు మీ పనికి రాని ప్రకటనలు మరో వైపు...?
   విజ్ఞులైన బహుజనులారా..!
   ఆత్మగౌరవంగా బ్రతకండి...!
   భారత జ్యాంగాన్ని కాపాడుకోండి..!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

  1. మతోన్మాదము దేశంలో పాతుకుపోతుంది. ఇకనైనా మేలుకోండి మిత్రులారా. జై భీమ్ అన్న

    ReplyDelete

Post a Comment