Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఈ దేశంలో వాస్తవాలు రాస్తే , మాట్లాడితే జైలుకు పంపుతారు...!

ఈ దేశంలో వాస్తవాలు రాస్తే , మాట్లాడితే జైలుకు పంపుతారు...!
   ఒక మహిళ (దళిత)ను రేప్ చేసి చంపి కనీసం శవాన్ని కూడా ఇవ్వని సంఘంటనను బాధ్యత కలిగిన ఒక జర్నలిస్ట్ రికార్డ్ చేశాడని ఆ చర్య ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందని భావించిన యోగీ సర్కార్ ఆ జర్నలిస్ట్ పై రాజద్రోహం కేసు, మనీలండరింగ్ కేసులతో పాటు అనేక అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపింది.

   ఈ కేసులో సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసిన మిగితా కేసులు ఉన్నాయని బయటకు రాకుండా చేస్తున్నారంటే ఈ మతోన్మాద ప్రభుత్వవాల తీరును ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది...!

   ఒక మహిళను నలుగురు కామాంధులు విచక్షణ రహితంగా రేప్ చేసి అమ్మాయి శరీరంలోని బాగాలని ఒక్కఒక్కటిగా విరిచి చంపివేస్తే దోషులకు శిక్షవేయకుండా అసంఘటనను రికార్డు చేసిన ఒక రిపోర్టర్ ను ఇబ్బందులకు గురిచేశారు, తను జైల్లో ఉండగా తన తల్లి మరణిస్తే కూడా చలనం లేని సర్కార్ ను ప్రజలు ఎన్నుకొన్నారంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు...!

   వాక్ స్వాతంత్రం ఉన్న ఈదేశంలో నిజాలు మాట్లాడితేనే మతోన్మాదుల మనోభావాలు దెబ్బతింటే, మరి ఈదేశ పౌరులను కులంపేర, మతం పేర, ఆహారం తినడం పేర, ఇంకా ఎన్నో ఎన్నోన్నో సంఘనటలతో చంపివేస్తే ఆ వర్గాలకు మనోభావాలుండవా...?

   అయ్యప్ప గురించి అవహేళనగా మాట్లాడిన బ్రాహ్మణులకు, బైరి నరేష్ కు తేడా ఏముందని, బైరి నరేశ్ ను జైల్లో పెట్టారు...?

   భారత రాజ్యాంగం గురించి అందులో ఈ ప్రజలకు కల్పించిన హక్కుల గురించి తెలియకుండా చేసి బీరు, బిర్యానీ, డబ్బుతో ఓట్లను కొంటున్న పార్టీలను, ఎందుకు ఎన్నికల కమిషన్ నియత్రించడం లేదో ఎవ్వరికి అర్థం కాదు. అస్సలు ఆ విశయాలను ఎవ్వరికి తెలియకుండా కుట్ర చేసి ఉన్నత వర్గాలు దేశాన్ని పరిపాలిస్తున్నాయి.

   మరేం చేద్దామో ఆలోచన చేయాలిసిన అవసరం బాధిత సమాజంకు ఉందా...? లేదా...? ఒక్కసారి ఆలోచన చేయమని రెక్వెస్ట్ చేస్తున్నా...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

Post a Comment