Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఈ దేశంలో అందరూ లక్ష్మిదేవిని పూజిస్తారు...! కానీ లక్ష్మిదేవి మాత్రం ఈదేశంలో ఉండనంటుంది...ఎందుకు....?

దేశంలో రాజ్యాంగం అమలు తీరు చూస్తే ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వాలు విపలమైనట్లు అర్థమైతుంది....? కానీ...?

   దేశ సంపదను దోచుకొన్న వారే పాలకులుగా ఉన్నారంటే...ఉంటున్నారంటే....? తప్పెవరిది....అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది....!

   ఈ దేశంలో అందరూ లక్ష్మిదేవిని పూజిస్తారు...! కానీ లక్ష్మిదేవి మాత్రం ఈదేశంలో ఉండనంటుంది...ఎందుకు....?

జనాభాలో ఈదేశం ప్రపంచంలోనే మొదటి స్థానం కోసం పోటీ పడుతుంది ...!

   కానీ...!

   పచ్చిమ దేశాల్లో తయారైన వస్తువులు కొనుగోలు చేయటం కోసమే మనం జనాభాలో ముందున్నాం అనే సంగతి ఎవరికయినా అర్ధం అవుతుందా...!

   భారత్ లో పుట్టి చదువుకొని ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో స్థిరపడిన వారే ఆదేశ సంపదను పెంచి ప్రపంచంలో అగ్ర దేశంగా ఉంచుతున్నారు...!

   ప్రపంచంలో అంగ్రగామి సంస్థల్లో, కంపెనీల్లో మనదేశానికి చెందిన సుందర్ పిచాయ్, లాంటి వాళ్ళే నడిపిస్తున్నారంటే లోపం ఎక్కడుందో ఆలోచన చేయవలసిన అవసరం మనకు ఉందా లేదా...!

   ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రాజ్యాంగం అంటున్న దేశంలో ఇప్పటికీ పేదరికం ఎందుకుందో చర్చ చేయండి...?

   కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ శాఖ, సిబిఐ, ఎన్నికల సంఘం, ప్రణాళిక సంఘం, తదితర స్వతంత్ర సంస్థలు ఎందుకు వాటి స్వరూపాన్ని కోల్పోతున్నాయి ..! వాటి పని అవి స్వతంత్రంగా ఎందుకు చేయలేక పోతున్నాయో ఆలోచన చేయండి...!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments