Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఏదో మతలబు ఉంది...!

గిదెంది....?

   ఎక్కువ ఓట్లు ఉన్నొల్లు కదా..! ఎన్నికల్లో గెలిచేది...! మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలే గెలుస్తాయని టీవీ ల్లో నాయకుల్లో,జనంలో చర్చ జరుగుతుంది.

 ఇదెలా...?

మునుగోడు లో బీసీలు 67శాతం అంటే సుమారు 1,92000 ఓట్లు ఉంటే అందరు రెడ్డిలు గెలుస్తారు అని ప్రచారం చేస్తున్నారు...?

   4 వేల నుండి 7 వేల ఓట్ల బలమున్నా రెడ్డిలు ముగ్గురు నిలబడితే మనిషి 3 వేల ఓట్లు వస్తేనే గెలుస్తరా...?

800 ఒట్లున్నా కులం 4సార్లు,7000 ఓట్లున్నా కులం 8 సార్లు ఎమ్మెల్యేలు ఐతే 192000 బీసీలు ఎందుకు ఎమ్మేల్యేలు కావడం లేదో అర్థం కావడం లేదు...!

  కాదు ఏదో మతలబు ఉంది...!

బిసిలు,ఎస్సీలు,ఎస్టీలు రెడ్లకు ఓట్లు వేస్తేనే గెలుస్తున్నారు. ఈ వర్గాలు తమను తామే ఓడించుకుంటున్నారు. ఓటు అంటే డబ్బులున్న వాళ్లకు అమ్ముకునే ఒక వస్తువు అనుకుంటున్నారు.

తమను రెడ్లకు అమ్ముకుంటున్నామనే సంగతి తెలుసుకుంట లేరు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందు సదువు,సంధ్య లేక బానిసత్వంలో బ్రతికిన బీసీ లకు రాజ్యాంగం ప్రకారం అధికారం రావాలి...! కానీ అగ్రవర్ణ రాజకీయ పార్టీల మోసాలకు గురవుతూ ఇప్పటికీ 75 సంవత్సరాల కాలం గడిచింది...! ఏమొచ్చింది....?

 చదువుకునే పిల్లలకు ఉద్యోగం లేదు, వ్యవసాయం చేసే రైతుకు భూమి లేదు, కులవృత్తులతో బ్రతుకుదమంటే కులవృత్తులు వారే కబ్జా చేసి నిరుపేదలుగా మార్చి బీసీ ల శ్రమను పిండి పిప్పిచేసి చావకుండా బ్రతకకుండ చెయ్యబట్టిరి...!

   ఇవన్ని బీసీలకు కనపడుత లేవా...?

మరెందుకు మిమ్మల్లి అనేక ఏళ్లుగా మోసం చేస్తున్నా పార్టీలను ఓడించరు...!

  సదువు లేని నాడు అదే పరిస్థితి,జ్ఞానం ఉన్నా నేడు అదే పరిస్థితి ఐతే మిమ్మళ్ళి ఎవడు కాపాడాలి....!

మోసం చేసిన పార్టీల ఎజెండాలు ఇంకెంత కాలం మోస్తారు...!

  మీ చైతన్యనాన్ని చూసి ప్రపంచం నవ్వుకుంటున్నారు... మారండి...!

   ఇంకెంత కాలం మీ పిల్లల జీవితాలు బలిపెడుతారు...!    గొర్రెకు,బర్రెకు, ఓట్లు వేస్తారా...?

ఇదేనా మీ జ్ఞానం...!

  ఇప్పుడు మునుగోడు లో డబ్బుల సంచులతో పార్టీలు దిగి నిన్ను ఎట్లైన కొని అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకో అర్థం కావడం లేదా...!

   మరండన్నా... మారి...!

మీకు అంబేడ్కర్ ఇచ్చినా హక్కులు పొంది అభివృద్ధి చెంది మీ పిల్లను శాసన కర్తలను చేయండి...!

వాడు ఇచ్చె ముస్ట్టి ఐదు వందలకు ఓటును అమ్మి పలుచన కాకు....!

  మీ మునుగోడు బరిలో ఉన్నా బీసీ నీ గెలిపించి బీసీల కు రాజ్యాధికారానికి బాటలు వెయ్యి...!

******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments